Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సినిమాల్లో అవకాశాలు కోసం వెళ్లే యువతుల్ని నిర్మాతలు బెడ్ రూమ్ కి పిలుస్తున్నారన్న ఆరోపణలు ఎప్పటినుంచో వింటున్నాం. ఈ విషయాలు ఈ మధ్య బాగా వినిపిస్తున్నాయి. రమ్యకృష్ణ లాంటి సీనియర్ నటీమణులు పడక పిలుపులు కామన్ అన్నంత రీతిలో మాట్లాడారు. ఇక వెండితెర కి దూరమైన నటీమణులు ఎందరో సినీ నిర్మాతలు, దర్శకుల నుంచి తాము ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి అడపాదడపా ప్రస్తావిస్తూనే వున్నారు. ఈ విషయాలు ఇలా బయటికి వస్తుండగానే ఓ హీరో తన ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయాలు చలనచిత్ర పరిశ్రమని షేక్ చేస్తున్నాయి.
ఆశిష్ బిష్త్ అనే వర్ధమాన బాలీవుడ్ నటుడు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించారు. 29 ఏళ్ళ ఈ నటుడు చెప్పిన విషయాలతో బాలీవుడ్ లో ప్రకంపనలు పుడుతున్నాయి. ఆశిష్ సినిమాల్లో అవకాశాల కోసం కొందరు మహిళా నిర్మాతల్ని కలిసినప్పుడు వాళ్ళు తమని బెడ్ రూమ్ లో సంతృప్తిపరిస్తే అవకాశాలు ఇస్తామన్నారట. అయితే తాను వాటికి లొంగలేదని, సహనంగా వేచి చూడడం వల్ల ఇప్పుడు బాగానే అవకాశాలు వస్తున్నాయని చెబుతున్నారు. ఆశిష్ వ్యాఖ్యలతో బాలీవుడ్ లో మహిళా నిర్మాతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు .
మరిన్నివార్తలు
స్పందించిన వెంకటేష్ ఫ్యామిలీ
శమంతకమణి ప్రివ్యూ.
నిద్రమాత్రలు వేసుకున్నది నిజమే : వితిక