బాలీవుడ్ కింగ్ ఖాన్ అంటే టక్కున గుర్తుకు వచ్చే పేరు షారుఖ్ ఖాన్ అప్పట్లో వరస హిట్ట్స్ తో బాక్స్ ఆఫీస్ ని షాక్ గురుచేసింది ఎవరు అంటే అది బాలీవుడ్ కింగ్ ఖాన్ కె చెందింది. కానీ గత ఫైవ్ ఇయర్స్ నుండి వరస ప్లాప్స్ తో సతమత మావ్వుతున్నాడు. తాజాగా అయన ఆనంద్ యల్ రాయ్ దర్శకత్వంలో జీరో అనే మూవీ లో నటించాడు. ఈ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న షారుఖ్ భారీ అంచనాల నడుమ విడుదల చేశాడు. సినిమా మొదటి షో నుండే విపరీతమైన నెగటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. జీరో మూవీ పరాజయంతో షారుఖ్ తివ్రనిరశకు లోనైయ్యాడు. ప్రేక్షకులు కూడా షారుఖ్ సినిమాలు చెయ్యకపోవడమే మంచిది అనే పరిస్థితికి వచ్చాడు.
జీరో టైటిల్ కూడా షారుఖ్ ను జీరో చేసిందని సోషల్ మీడియాలో దుమ్ము ఎత్తి పోస్తున్నారు. బాలీవుడ్ చిత్రవర్గాల సమాచారం ప్రకారం కింగ్ ఖాన్ కూడా ఇకా మీదట సినిమాలకు కాస్త విశ్రాంతి ఇవ్వాలని కోరుతున్నట్లు తెలుస్తుంది. ఎందుకు అంటే షారుఖ్ తో సినిమా అంటే ప్రొడ్యూసర్స్ కుడా వామ్మో అంటున్నారు. అయన సినిమాను కొన్నాలన్నడిస్ట్రిబ్యూటర్లు- ఎగ్జిబిటర్లు, ముందుకు రావడం లేదు. అయన రెడ్ చిల్లీస్ పేరుతో బ్యానర్ స్తాపించి గతంలో మంచి సినిమాలు తీశాడు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కానీ సినిమానే ఉపిరి అనుకోని సినిమా రంగం వైపు ప్రయాణించిన షారుఖ్ సినిమాను వదిలేస్తాడు అనుకోవడం పొరపాటే అవ్వుతుంది కాకపోతే నిర్మాతగా, హీరోగా ఓ కొన్నిఇయర్స్ సినిమా రంగానికి దూరంగా ఉండవచ్చు. కానీ అలా చేస్తే మాత్రం షారుఖ్ ఖాన్ ఫాన్స్ మాత్రం చాలా నిరాశలో ఉంటారు. ఏది ఏమైనా కింగ్ ఖాన్ త్వరలో మంచి సినిమాలు తియ్యాలని కోరుకుందాం.