Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానంను సంపాదించుకున్న సావిత్రి జీవిత కథతో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘మహానటి’ అనే చిత్రాన్ని అశ్వినీదత్ తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమాలో సమంత ఒక ముఖ్య పాత్రను పోషిస్తుంది. దుల్కర్ సల్మాన్‌తో పాటు ఇంకా పలువురు సినీయర్ స్టార్స్ కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నారు. తాజాగా అర్జున్‌రెడ్డితో ఒక్కసారిగా స్టార్ అయిన షాలిని పాండే కూడా ఈ చిత్రంలో నటిస్తుంది.
సావిత్రికి సన్నిహితురాలైన జమున పాత్రను షాలిని పాండే పోషిస్తుందనే వార్తలు వస్తున్నాయి. అయితే ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. తాజాగా చిత్రీకరణలో షాలిని పాండే పాల్గొంటుంది. ఆ సందర్బంగా మహానటి చిత్ర సెట్స్ నుండి తీసిన ఫొటో ఒకటి లీక్ అయ్యింది. అందులో షాలిని పాండే ుక్ రివీల్ అయ్యింది. షాలిని పాండే ‘మహానటి’లో ఇలా ఉండబోతుందని క్లారిటీ వచ్చేసింది.