విభిన్న కథలను ఎంపిక చేసుకుని నటిస్తాడనే టాక్ ఉన్న ప్రముఖ హీరో శర్వానంద్ తాజాగా పడిపడి లేచే మనసు అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ చిత్రం తర్వాత శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా నటించే అవకాశం ఉందని సమాచారం అందుతుంది. బ్రహ్మోత్సవం చిత్రంతో డిజాస్టర్ ఫలితాన్ని చవిచూసిన శ్రీకాంత్ అడ్డాతో సినిమా అంటే హీరోలు అంతా కూడా కంగారు పడుతున్నారు. ఎప్పుడెప్పుడు ఈయన సినిమా చేద్దామా అని ఎదురు చూస్తున్నాడు. పలు కథలు రాసుకుని యువ హీరోల వద్దకు తిరుగుతున్న శ్రీకాంత్ అడ్డాల తాజాగా శర్వానంద్‌తో ఓకే చెప్పించుకున్నట్లుగా సమాచారం అందుతుంది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం త్వరలోనే శర్వానంద్‌తో ఈయన మూవీ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. భారీ ఎత్తున కాకుండా ఒక చిన్న తరహా బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించాలని దర్శకుడు శ్రీకాంత్అడ్డాల భావిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. బ్రహ్మోత్సవం చిత్రం ఫలితంతో కాస్త జాగ్రత్త పడ్డ శ్రీకాంత్ అడ్డాల ఇకపై అలాంటి పిచ్చి పనులు చేయను అంటూ చెప్పుకొచ్చాడు. మంచి కథలను ఎంపిక చేసుకున్న శర్వానంద్‌కు శ్రీకాంత్ వద్ద ఉన్న కథ బాగా నచ్చిందని అందుకే ఆ చిత్రంకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. భారీ ఎత్తున అంచనాల నడుమ ప్రస్తుతం శర్వానంద్ సినిమాలో నటిస్తున్నాడు. ఆ తర్వాత శ్రీకాంత్ అడ్డాల సినిమాలో నటించబోతున్నాడు.