సినిమా చూస్తున్నా ప్రేక్షకుల మనసులో ఎదో ఓ మూల ఓ చిన్న ఆలోచన ఉంటుంది. ఏ హీరో ఎంత పారితోషకం తీసుకుంటాడు. ఏ కమిడియన్ ఎంత పారితోషకం, ఏ హీరొయిన్ ఏంత పారితోషకం తీసుకుంటుంది. అనే ఆలోచన సినిమాలు చూసే ప్రతి ప్రేక్షకుడి మనసులో ఉంటుంది. తాజాగా కమిడియన్ పృథ్వీ రాజ్ కమిడియన్స్ పారితోషకంపైన ఆసక్తి కర కామెంట్స్ చేశాడు. పూర్తి వివరాలోకి వెళ్ళితే… ఒక్కపుడు బ్రహ్మానందం గారు ఒక్కరోజు కాల్షీట్ కు 5 లక్షలు తీసుకునేవాడు. అతని కాల్షీట్ ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు రోజుకు 5 లక్షలు చొప్పునా తీసుకునేవాడు. అది బ్రమ్మానందం గారు ఉన్న రోజులు నడిచింది. ఇప్పుడు అది అతనితోనే పోయింది. ఇప్పుడు కమిడియన్స్ ఎక్కువగా ఉన్నారు. ఒక్క రోల్ కు ఇద్దరు ముగ్గురు ఎగబడి మరి చేస్తున్నారు.
మాలాంటి కమిడియన్స్ అంటే రఘుబాబు, పృథ్వీ రాజ్, కృష్ణ భగవాన్ లాంటి కమిదియన్స్ కి మాత్రం ఒక్క కాల్షీట్ కు 50 వేల చొప్పున ఇస్తున్నారు. ఒక్క సినిమాకు అతను ఓ నెల రోజులు అవసరం ఉంటె అది ఓ మూడు నాలుగు రోజులో పూర్తి చేస్తున్నారు. కావునా మూడు నాలుగు రోజులకు రోజుకు 50 వేల చొప్పునా నాలుగు రోజులకు 2 లక్షలు ఉంటుది. అలా వన్ ఇయర్ కి 20 సినిమాలు తీస్తే ఓ 40 లక్షలు వస్తాయి. నేను ఇంతకు ముందు. వన్ ఇయర్ కి 40 సినిమాలు చేసేవాడిని, ఇప్పుడు కమిడియన్స్ ఎక్కువగా ఉన్నారు. అందువలన ఓ 20 సినిమాలు అలా చేస్తున్నాను. ఇంకా జబర్దస్త్ కమిడియన్స్ అయితే మాత్రం వలకు రోజుకు 10 నుండి 20 వేల వరకు ఉంటుంది. ఇవివి గారు ఉన్న టైం లో కమిడియన్స్ కు చాలా వరకు మంచి ఆదాయం వచ్చేది. ఇప్పుడు కమిడియన్స్ ఎక్కువ. డైరక్టర్స్ తక్కువగా ఉన్నారు. అన్నారు.