భరత్‌ భార్య గురించి షాకింగ్‌ విషయాలు

Shocking things about Bharat's wife

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

Shocking Things About Bharat’s Wife

రవితేజ సోదరుడు భరత్‌ మొన్న హైదరాబాద్‌ ఔటర్‌ రింగు రోడ్డుపై కారు యాక్సిడెంట్‌లో మృతి చెందిన విషయం తెల్సిందే. భరత్‌ను ఒక అనాధ శవంలా, ఎవరు లేని ఏకాకిలా చివరకు చేసి అంత్య క్రియలు నిర్వహించడం అందరిని కలిసి వేచిన విషయం. భరత్‌ పట్ల రవితేజ అలా చేసి ఉండకూడదు అనేది అందరి వాదన. అయితే భరత్‌ తీరు ఏమాత్రం బాగుండేది కాదు అని, ఆయన పట్ల రవితేజ కుటుంబ సభ్యులు చేసింది సరైనదే అంటూ ఆ కుటుంబంకు సన్నిహితంగా ఉండే వారు అంటున్నారు. ఇక భరత్‌ ఇంత వయస్సు వచ్చిన వివాహం చేసుకోలేదా అనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. అయితే భరత్‌కు నాలుగు సంవత్సరాల క్రితమే వివాహం అయ్యింది.

నాలుగు ఏళ్ల క్రితం భరత్‌ ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లి కూడా పోసాని మరియు పరుచూరి బ్రదర్స్‌ దగ్గరుండి మరీ చేసినట్లుగా తెలుస్తోంది. భరత్‌ ప్రవర్తన నచ్చక పోవడంతో పాటు, అతడి దురలవాట్లు ఎక్కువ అవ్వడంతో ఆమె భరత్‌ను వదిలేసి వెళ్లి పోయింది. ప్రస్తుతం ఆమె అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఉందట. ఆమె మరో పెళ్లి చేసుకుందని కూడా కొందరు అంటున్నారు. విడాకులు తీసుకోకుండానే ఇద్దరు వేరు అయ్యారు. భరత్‌ ఆమె దూరం అయిన తర్వాత మరింతగా చెడు మార్గంలో పయణించాడు. ఆ కారణంగానే కుటుంబ సభ్యులు భరత్‌ను దూరంగా పెట్టారు. రవితేజ కొన్ని సంవత్సరాలుగా తమ్ముడి విషయంలో బాధపడుతున్నట్లుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు