Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Shraddha Kapoor Playing Double Role In Prabhas’ Saaho Movie
‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ చేస్తున్న ‘సాహో’ సినిమా కోసం దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ స్థాయిలో అంచనాలున్న ‘సాహో’ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్దా కపూర్‌ను ఎంపిక చేసిన విషయం తెల్సిందే. భారీ పారితోషికం ఇచ్చి మరీ ఆమెను ఎంపిక చేసి సినిమా స్థాయిని అమాంతం పెంచారు. ఇక సినిమాలో శ్రద్దా కపూర్ పాత్ర గురించి మీడియా వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. అదేంటి అంటే శ్రద్దా కపూర్ ఈ చిత్రంలో రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతుందట. ఇలాంటి పాత్రలు ఇండియన్ సినీ వెండి తెరపై చాలా అరుదుగా వచ్చాయి అంటున్నారు.
హీరోయిన్ డబుల్ రోల్ అనేది చాలా అరుదుగా చూస్తుంటాం. ‘సాహో’ వంటి 150 కోట్ల బడ్జెట్ సినిమాలో హీరోయిన్ డబుల్ రోల్ అంటే ఏ స్థాయిలో సినిమా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభాస్ ఖచ్చితంగా ఈ సినిమాతో మరోసారి దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడం ఖాయం అని వస్తున్న వార్తలను చూస్తుంటే అనిపిస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంది కనుకే, డబుల్ రోల్ చేస్తుంది కనుకే ఆమెకు అంత పారితోషికం ఇస్తున్నట్లుగా చెబుతున్నారు. బాలీవుడ్లో చిన్న పుకారుగా మొదలైన ఈ వార్త ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమతో పాటు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. మరి నిజంగానే హీరోయిన్ డబుల్ రోల్ చేస్తుందా, చేస్తే ఎలాంటి పాత్రలు అని తెలుసుకునేందుకు ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ప్రశ్నకు సమాధానం లభించాలి అంటే సినిమా విడుదలయ్యే వరకు ఎదురు చూడాల్సిందే.
మరిన్ని వార్తలు :