Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వ్యక్తిగత సంగతులను అత్యంత గోప్యంగా ఉంచే శృతిహాసన్ ఇటీవల మాత్రం తన బాయ్ ఫ్రెండ్ తో తరచుగా బయట కనిపిస్తోంది. ఇటీవలే శృతి హాసన్ ఆమె బాయ్ ఫ్రెండ్ మైఖేల్ కోర్సెల్ ను తల్లికి పరిచయం చేసినట్టు వార్తలొచ్చాయి. శృతిహాసన్, మైఖేల్ కోర్సెల్, సారిక కలిసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. తాజాగా ఈ ప్రేమికులిద్దరూ శృతి తండ్రి కమల్ హాసన్ తో ఉన్న ఫొటోలు వైరల్ గా మారాయి.
చెన్నైలో జరిగిన తమిళ నటుడు ఆదవ వివాహానికి శృతి కమల్, మైఖేల్ తో కలిసి హాజరయ్యారు. శృతి సంప్రదాయ బద్ధంగా చీర కట్టుకోగా… లండన్ కు చెందిన మైఖేల్ తమిళ తంబీలా అడ్డపంచెలో పెళ్లికి రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు శృతి, మైఖేల్ త్వరలోనే పెళ్లిపీటలెక్కుతారని కామెంట్లు చేస్తున్నారు. అటు శృతి మాత్రం ఈ విషయాన్ని మీడియా దగ్గర ప్రస్తావించడం లేదు. తన ప్రేమ వ్యవహారంపై స్పందించేందుకు ఆమె నిరాకరిస్తోంది. వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవడం ఇష్టం లేదంది. ప్రస్తుతం శృతి తండ్రి దర్శకత్వంలో శభాష్ నాయుడు చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా విడుదల తర్వాత శృతి పెళ్లి జరిగే అవకాశముందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.