శిల్పా సన్యాసం తీసుకోవాల్సిందేనా..?

silpa-mohan-reddy-will-take-political-sannyasa

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
నంద్యాలలో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని శిల్పా మోహన్ రెడ్డి భీషణ ప్రతిజ్ఞ చేశారు. దీనికి ప్రతిగా తాను ఓడితే మంత్రి పదవి నుంచి తప్పుకుంటానని భూమా అఖిలప్రియ కూడా చెప్పారు. అదే సమయంలో ఆమె మరో మాట చెప్పారు. శిల్పాకు సవాళ్లు అలవాటే కానీ.. ఎప్పుడూ మాట మీద నిలబడలేదన్నారు. ఇప్పుడూ అదే నిజమైంది. తాను ఛాలెంజ్ చేసినప్పుడు అఖిల స్వీకరించలేదని జారుకున్నారు శిల్పా.

ఈ సవాళ్ల పర్వం గురించి పక్కనపెడితే.. నంద్యాలలో డబ్బే గెలిచిందని చెప్పేటప్పుడు శిల్పా ముఖంలో నీరసం కొట్టొచ్చిన్లు కనబడింది. పోలింగ్ ముగిశాక ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా శిల్పా గెలుస్తామని చాలా నీరసంగా చెప్పడంతోనే.. టీడీపీ విజయం ఖాయమైంది. అవును శిల్పా నంద్యాల మాత్రమే కోల్పోలేదు. వ్యక్తిగతంగా చాలా కోల్పోయారు. ఎన్నో ఆస్తులు అమ్ముకున్నా ఫలితం దక్కలేదు.

సోదరుడి ఎమ్మెల్సీ పదవి పోయింది. తన ఆస్తులన్నీ కరిగిపోయాయి. కల్పవృక్షం లాంటి శిల్పా సహకార్ పై ప్రభుత్వ కన్ను పడింది. ఇప్పటికే ఈసీ కేసు నమోదు చేసింది. దీంతో శిల్పా సహకార్ ఉంటుందో, ఊడుతుందో తెలియదు. పైగా రాజకీయంగా, ఆర్థికంగా దెబ్బతిన్నాక మళ్లీ కోలుకోవడం అనేది కలలో మాట. అందుకే శిల్పా ఫ్యామిలీ మొత్తం నిరాశలో కూరుకుపోయింది.

మరిన్ని వార్తలు:

వెయ్యి నోట్లాట లేనట్లే

టీడీపీ లోకి జంప్ అయ్యే వైసీపీ ఎమ్మెల్యే లిస్ట్ ఇదే…

టీడీపీ లోకి జగన్ కుడిభుజం…సీక్రెట్ గా డీల్ ?