Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సంప్రదాయం, విలువల మాట శృంగార సంబంధాల విషయంలో పెద్దగా కనిపించని కాలం ఇది. తాజాగా హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్ లో వ్యభిచారం చేస్తూ ఓ సినీ నటి అరెస్ట్ అయ్యిందన్న వార్త సంచలనం రేపింది. ఆశ్చర్యం ఏమిటంటే ఆమెను ఎంతో పకడ్బందీగా అరెస్ట్ చేసిన పోలీసులు అందుకు సహకరిస్తున్న ఇంకో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. కానీ ఆమెతో దొరికిన ఆ సరస శృంగార మూర్తి ఎవరో మాత్రం బయటకు రాలేదు. ఇప్పుడు ఆ నటి అదే విషయాన్ని అడుగుతోందట. నిజంగా నేను తప్పు చేస్తుంటే నాతో పాటు వున్న పేరు కూడా బయటకు రావాలి కదా అని ప్రశ్నిస్తోంది. నిజమే కదా మరి. ఆ తప్పు ఒక్కరు చేసేది కాదు కదా. వ్యభిచారం కేసుల్లో ఇలా ఒక్క అమ్మాయి పేరు మాత్రమే బయటకు వస్తుంటే ఇంకో వ్యవహారంలో కేవలం మగవాడి పేరు మాత్రమే బయటకు వస్తోంది.
వివాహం అయిన వాళ్ళు అక్రమ సంబంధాలు నెరుపుతూ పట్టుబడతుంటారు. వీరిని ఆయా కుటుంబాల్లోని వారే పట్టిస్తారు. అలా పట్టుబడినప్పుడు కేవలం మగవాడి మీద మాత్రమే కేసులు నమోదు చేస్తుంటారు. తప్పు ఇద్దరూ చేస్తున్నప్పుడు ఒక్కరి మీద కేసు ఏమిటి అని ఇటీవల ఓ పెద్ద మనిషి ఏకంగా సుప్రీమ్ కోర్టుని ఆశ్రయించాడు. ఆయన వాదనలో పస ఉందని ఒప్పుకొన్న కోర్టు దీనిపై కేంద్రం వివరణ కోరింది.
పైన మన చెప్పుకున్న రెండు సందర్భాల్లో జరుగుతోంది ఒకే రకమైన తప్పు. కాకుంటే ఒక చోట డబ్బు మార్పిడి ఉంటే ,ఇంకో చోట సంబంధంలో ఇష్టాయిష్టాలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. అయితే ఒక చోట తప్పుని అమ్మాయి ఖాతాలో , ఇంకో చోట తప్పుని అబ్బాయి ఖాతాలో వేయడంలో మాత్రం లాజిక్ కనిపించడంలేదు.