Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
డ్రగ్స్ కేసులో హీరోయిన్ ఛార్మి నేడు సిట్ ముందు విచారణకు హాజరు అయిన విషయం తెల్సిందే. విచారణను తప్పించుకునేందుకు ఛార్మి హైకోర్టును ఆశ్రయించినా కూడా ఆమెకు విచారణ తప్పలేదు. హైకోర్టు విచారణకు హాజరు కావాల్సిందే అని చెప్పడంతో నేడు విచారణ అధికారుల ముందు ఛార్మి హాజరు అయ్యింది. ఆమె కోరినట్లుగా వ్యక్తిగత లాయర్‌ను లోనికి పంపించలేదు. అయితే ఆమె కోరినట్లుగా మహిళ అధికారితో మాత్రమే విచారణ జరపనున్నారు.
ఛార్మి గతంలో పలు సార్లు కెల్విన్‌తో మాట్లాడటం, చాటింగ్ చేయడం జరిగింది. ఆ కాల్స్ వివరాలు మరియు ఛాటింగ్‌ను ఆమె ముందు ఉంచి వాటిపై ఉన్న అనుమానాలు నివృత్తి చేసుకోనున్నారు. అలాగే పూరి డ్రగ్స్ తీసుకుంటాడు అనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయన సన్నిహితురాలుగా మీరు ఏమంటారు, గోవా మరియు విదేశాల నుండి మీరు డ్రగ్స్‌ను పలు సార్లు తీసుకు వచ్చినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. దానిపై మీరు ఇచ్చే సమాధానం ఏంటి. డ్రగ్స్ తీసుకోలేదు అని చెప్పేందుకు మీరు చూపుతున్న కారణం ఏంటి అంటూ ప్రశ్నల వర్షం కురిపించేందుకు సిట్ అధికారులు సిద్దం అయ్యారు. ఛార్మిని నేడు సాయంత్రం 5 గంటల వరకు విచారించే అవకాశం ఉంది. ఆమె అనుమతిస్తే ఆమె నుండి డ్రగ్స్ టెస్ట్‌కు శాంపిల్స్ తీసుకునే అవకాశం ఉంది. ఛార్మిని విచారిస్తే పలు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని సినీ ప్రముఖులు భావిస్తున్నారు.
మరిన్ని వార్తలు: