రష్యాకు చెందిన ఆరేండ్ల బాలుడు ఇబ్రహీం ల్యానవ్ కేవలం రెండు గంటల్లో 3,270 పుషప్స్ కొట్టి ప్రపంచ రికార్డు సృష్టించాడు. అతడు ఆగకుండా 4,445 పుషప్స్ కొట్టినప్పటికీ 2 గంటల్లో 3,270 పుషప్స్ కొట్టడం విశేషం. దీంతో ఆ బాలుడికి ఓ అపార్ట్మెంట్ బహుమానంగా అందడమే కాకుండా అతడి పేరు రష్యా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది. ఇటీవల రష్యాకు చెందిన చింగిస్ అనే స్పోర్ట్స్ క్లబ్ పుషప్స్ పోటీలను నిర్వహించింది. ఈ క్లబ్‌కు తన తండ్రితోపాటు కలిసి వెళ్లే ఇబ్రహీం పుషప్స్ శిక్షణ తీసుకున్నాడు. పుషప్స్ పోటీల్లో కొడుకును విజేతగా నిలుపడానికి తండ్రి కూడా సహకారం అందించాడు. దీంతో రాటుదేలిన ఇబ్రహీం పోటీల్లో ఆగకుండా 4,445 పుషప్స్ కొట్టి చరిత్ర సృష్టించాడు.