Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రత్యేకా హోదా కాదు కదా ప్రత్యేక ప్యాకేజీ కూడా ఇవ్వమని కేంద్రం తేల్చేయడంతో బీజేపీ తో తెగతెంపులు చేసుకుంది తెలుగుదేశం. దీంతో ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా ఉద్యమం తీవ్రతరం అయ్యింది. కేంద్రం ఒకప్పుడు చెప్పిన మాటలు, ఇప్పుడు చెప్తున్న మాటలు వింటున్న తెలుగు ప్రజానీకం, అలాగే ప్రజా ప్రతినిధులు ఉద్యమం వైపు అడుగులు వేస్తున్నారు. అయితే కేంద్రంలో బీజేపీ పాలన కొనసాగిస్తున్నా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంతో బీజేపీ నేతలు అంటేనే చిరాకు పడే పరిస్థితి ఏర్పడింది.
కాని ఇవేమీ పట్టని ఎపీ బీజేపీ నేతలు టీడీపీని టార్గెట్ చేసుకొని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే క్రమంలో గనుక ముందుకు వెళితే ఎలాగొలా ఏపీ లో బలపడిపోతామనే ఉద్దేశ్యంతో ఇప్పటిదాకా ఏపీ అధ్యక్షుడిగా ఉన్న హరిబాబుని పక్కన పెట్టి ఎవరయినా కాస్త టీడీపీని కార్నర్ చేయగలిగే నాయకుడికి ఆ పదవి అప్పగిస్తే బాగుంటుంది అనే భావనలో జాతీయ నాయకత్వం ఉన్నట్టు తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా జాతీయ నాయకత్వం తో బాటుగా, జాతీయ కార్యదర్శి రాం మాధవ్ కొత్త అధ్యక్యుడి ఎన్నిక కోసం కసరత్తు జరుగుతోంది. అయితే ఈ ప్రక్రియని పూర్తి చేసి ఇక నాలుగైదు రోజుల్లోనే కొత్త అధ్యక్షుడెవరనే ప్రకటన చేస్తున్నట్టు తెలుస్తోంది. టీడీపీతో తెగదెంపుల తరువాత, వారి మీద పోరాడాల్సిన సమయంలో ఏర్పాటవుతున్న రాష్ట్ర కార్యవర్గం కావడంతో అందరికీ ఆసక్తి నెలకొంది.
రాష్ట్రంలో బలంగా ఉన్న టీడీపీని కార్నర్ చేయాలంటే అడ్డగోలుగా మాట్లాడే నాయకుడైతేనే బెటరని కమలం భావిస్తోంది. వారిలో సోము వీర్రాజు ముందు వరుస లో ఉన్నట్టు తెలుస్తోంది. ఆయనతో బాటు కన్నా లక్ష్మీ నారాయణ కూడా లిస్ట్ లో ఉన్నట్టు తెలుస్తోంది. మరో పక్క ఈ మధ్యే మంత్రివర్గం లోనుండి బయటకి వచ్చి తెలుగుదేశం అంటేనే ఒంటి కాలి మీద లేస్తున్న పైడికొండల మాణిక్యాలరేవు పేరు కూడా వినిపిస్తోంది. అయితే వీరిలో మాణిక్యాలరావు విషయం తీసుకుంటే ఆయన ఒకరకంగా అడ్డగోలుగా మాట్లాడలేరు, అదీ కాక నాలుగేళ్లుగా మంత్రిగా ఉండి ఇప్పుడు విమర్శలకు దిగితే అది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళుతుంది, సో ఆయన్ని కొంచెం పక్కన పెట్టె అవకాసం ఉంది.
ఇక కన్నా విషయానికి వస్తే ఆయనకి దూకుడున్ననేతగా పేరుంది. చంద్రబాబు లాంటి వ్యక్తిని ఢీకొట్టాలంటే కన్నాకి అవకాశం ఇస్తే బాగుంటుంది కానీ కన్నా కాంగ్రెస్ నుంచి వచ్చిన నేత. దీంతో వేరే పార్టీనుంచి వచ్చిన నాయకుడికి పార్టీ పగ్గాలు అప్పగించినా పార్టీ లో తప్పుడు సంకేతాలు వెళతాయి. ఇక మిగిలింది సోము వీర్రాజు ఈయన పేర్లు చాలా సార్లు వార్తలలోకి వచ్చింది ఈయనే తరువాతి రాష్ట్ర అధ్యక్షుడు అని పైగా మొన్నటికి మొన్న అసెంబ్లీ లాబీల్లో మాణిక్యాలరావు టీడీపీ నేతలతో సరదాగా మాట్లాడుతూ నేను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడ్ని కావడం లేదు సోమువీర్రాజు పేరు సూచించా అని చెప్పారు. ఆయనైతేనే మీకు కరెక్ట్ అని కూడా అనేశారుఅన్నారు. దీంతో సోమువీర్రాజు పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ఇకపోతే ప్రతి చిన్న విషయాన్నీ దృష్టిలోకి తీసుకునే బీజేపీ హైకమాండ్ ఎవరికి అవకాశం ఇస్తుందనేది కాలమే నిర్ణయించాలి మరి.