Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
విభజన చట్టంలో హామీలు నెరవేర్చకుండా మాటలతో బుకాయిస్తున్న బీజేపీ నాయకులు స్పీడ్ పెంచారు. ఆంధ్రాలో ఆత్మగౌరవ నినాదం, ప్రత్యేక హోదా ఉద్యమం ఊపు అందుకునే లోపే జనాన్ని అయోమయంలోకి నెట్టాలని ఇంకో ప్రయత్నం చేసాడు సోము వీర్రాజు. మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న సోము ఎప్పటిలాగానే బీజేపీ రాష్ట్రానికి ఎన్నో చేసిందని చెప్పుకున్నాడు. పోలవరం కోసం రెండు మండలాలను కలిపే విషయంలో తనదే కీ రోల్ అని జబ్బ చరుచుకున్నాడు. ఇక చంద్రబాబు ఒకప్పుడు ప్యాకేజ్ కి ఓకే అని ఇప్పుడు ఎదురు తిరగడాన్ని సోము తప్పుబట్టారు.
మాట మార్చిన చంద్రబాబుని కూడా మీట్ ది ప్రెస్ కి పిలిచి ప్రశ్నించాలని సూచించాడు. ఆయనను ప్రశ్నిస్తాం కానీ విభజన హామీలను కేంద్రం ఎందుకు నెరవేర్చడం లేదని జర్నలిస్టులు మూకుమ్మడిగా విరుచుకుపడడంతో సోము నీళ్లు నమిలేశాడు. అప్పటిదాకా చంద్రబాబు మీద ఓ రేంజ్ లో ఫైర్ అయిపోయిన సోము సౌండింగ్ లో మార్పు వచ్చింది. గొంతు ఎక్కడో పాతాళానికి పడిపోయింది. జనాన్ని పిచ్చివాళ్ళని చేసి 2014 లో ఓట్లు వేయించుకుని మోసం చేసి, 2019 లో కూడా అలాంటి మోసమే చేద్దాం అనుకుంటే వినడానికి ఆంధ్రప్రజలేమీ వెర్రివాళ్ళు కాదని సోము లాంటి నాయకులకు త్వరలోనే తెలిసొస్తుంది. దానికి సంకేతమే ఈ రోజు మీట్ ది ప్రెస్.