Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ముందు నుండి అనుకున్నట్టుగానే కన్నా లక్ష్మి నారాయణ బీజేపీ ఏపీ అధ్యక్ష్యుడుగా నియమించబడడంతో ఏపీ బీజేపీలో ముసలం పుట్టినట్టు అయ్యింది. కన్నా లక్ష్మీనారాయణ నియామకంపై సోము వీర్రాజు వర్గం అసంతృప్తిగా ఉందని సమాచారం. వీర్రాజు కూడా ఈ నియామకం కొంత ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది. అంతేకాదు, నిన్న రాత్రి ఎనిమిది గంటల సమయంలో సోము వీర్రాజు వర్గానికి చెందిన కొంతమంది నేతలు భాజపాకి రాజీనామాలు చేయడం ఈ వాదనలకి బలం చేకురుస్తోంది. వీర్రాజుకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వనందుకు నిరసనగానే రాజీనామాలు చేస్తున్నట్టు ప్రకటిస్తూవిశేషం. తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు మాలకొండయ్య, రాజమండ్రి అర్బన్ జిల్లా అధ్యక్షుడు బి. దత్తు… ఈ రెండు కమిటీల్లోని కొంతమంది ప్రముఖ సభ్యులు రాజీనామాలు ప్రకటించారు.
రాజీనామా లేఖల్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతోపాటు, రామ్ మాధవ్ కి కూడా పంపినట్టు సమాచారం. నిజానికి, రాష్ట్ర అధ్యక్ష పదవి సోము వీర్రాజుకు వస్తుందని ఆయనతోపాటు, ఆయన వర్గీయులు కూడా తీవ్రంగానే విశ్వసించారు. ఎందుకంటే, పార్టీకి మొదట్నుంచీ వీర్రాజు విధేయుడిగా ఉంటూ వస్తున్నారు. ఇతర నేతలతో పోల్చితే చంద్రబాబు మీద ఘాటు విమర్శలు చేస్తూ, బీజేపీని ఏపీలో బలంగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. దీంతో టీడీపీతో విదివడ్డాక తరువాత పార్టీలో చేరిన కన్నాని అధ్యక్షుడిగా నియమించడంపై ఆ వర్గం జీర్ణించుకోలేకపోతోంది. ఏ రకంగా చూసినా అధ్యక్ష పదవి తననే వరిస్తుందని, పార్టీకి తొలి నుంచి సేవలు అందిస్తున్న తనను కాదని, రాష్ట్ర విభజన తర్వాత పార్టీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించడంతో ఆయన మనస్తాపం చెంది సోము వీర్రాజు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు ! అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తొలుత ప్రకటించిన ఆయన సాయంత్రం తర్వాత ఎవరికీ అందుబాటులోకి రాకుండా పోవడం పలు ఊహాగానాలకు తెరలేపింది. కన్నాతో కలిసి ఆయన ఢిల్లీకి వెళ్తారని భావించినప్పటికీ పార్టీ నేతలకు వీర్రాజు అందుబాటులో లేరట. ఆయన ఇప్పుడు ఎవరికీ అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లడం పార్టీలో కలకలం రేపుతోంది.