ఆంధ్రప్రదేశ్ లో ఘోరం చోటు చేసుకుంది. పశ్చిమగోదావరి గణపవరంలో ఓ పోలీస్ పండంటి బిడ్డ పుట్టిన ఆనందంతో ఇంటికి వెళ్తున్నారు. ఆస్పత్రిలో పుట్టిన తన బిడ్డను, భార్యను చూసుకొనేందుకు ఆనందంగా వెళ్తున్న వ్యక్తిని మినీలారీ రూపంలో మృత్యువు వెంటాడింది. దాంతో ఆకుటుంబంలో విషాదం నెలకొంది. ఈ ప్రమాదానికి సంబంధించి గణపవరం ఎస్సై ఎం.వీరబాబు కొన్ని వివరాలు తెలిపారు.
పశ్చమ గోదావరి జిల్లాలోని భీమవరానికి చెందిన చిట్టిమాని రాజు మంగళవారం ఉదయం తన ఆరేళ్ల కుమార్తె సాయిసంజనతో కలిసి మోటార్ సైకిల్‌పై భీమవరం నుంచి తాడేపల్లిగూడెం వెళ్తున్నారు. ఆ సమయంలో గణపవరం మండలం చిలకంపాడు వద్ద తాడేపల్లిగూడెం నుంచి వస్తున్న మినీలారీ ఢీకొంది. లారీ చక్రం రాజు తలమీదుగా పోవడంతో రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా కుమార్తె సంజనకు గాయాలు కావడంతో తాడేపల్లిగూడెం ఆస్పత్రికి తరలించినట్లు వివరించారు.