Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రస్తుతం చిత్ర సీమలో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోందనిపిస్తోంది. మహానటి సావిత్రి జీవిత చరిత్రగా మహానటి సినిమా తెరకెక్కి ఈరోజుకి హౌస్ ఫుల్ షోస్ తో నడుస్తోంది. ఇప్పటికే మరికొన్ని బయోపిక్స్ లాంఛనంగా మొదలయ్యాయి. ఎన్టీఆర్ బయో పిక్ గా ‘ఎన్టీఆర్’, వైఎస్సార్ బయోపిక్ గా ‘యాత్ర’ సినిమాలు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. ఇప్పుడు మరో రెండు బయోపిక్స్ వార్తల్లోకి వచ్చాయి. వాటిలో ఒకటి ఆత్మహత్య చేసుకుని మరణించిన హీరో ఉదయ్ కిరణ్ బయోపిక్ కాగా రెండోది హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన అలనాటి స్టార్ హీరొయిన్ సౌందర్య బయోపిక్.
అయితే ఉదయ్ కిరణ్ బయోపిక్ దర్శకుడు తేజ, సౌందర్య బయోపిక్ నిర్మాత రాజ్ కందుకూరి తెరకెక్కించేందుకు సిద్దమయ్యారని ఫిలింనగర్ వర్గాల సమాచారం. 2004 ఎన్నికల సమయంలో బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లి సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. దాదాపు వంద సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన సౌందర్య తెలుగు వారింటి హీరొయిన్ గా పేరు సంపాదించింది. అన్ని భాషల్లో ఆమెకి అభిమానులు ఉన్న నేపధ్యంలో తమిళ, తెలుగు, కన్నడం, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారట. పుట్టుంది కన్నడ సీమ అయినా… టాలీవుడ్ లో సూపర్ సక్సెస్ సాధించిన సౌందర్య అనతి కాలంలోనే అన్ని తెలుగు, తమిళ, కన్నడ చిత్రసీమల్లో పాపులారిటీ సంపాదించింది.