Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సూపర్ స్టార్ మహేష్‌బాబు, మురుగదాస్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘స్పైడర్’ చిత్రం విడుదలకు ముస్తాభవుతుంది. ఇటీవలే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా తమిళ వర్షన్ ఆడియోను విడుదల చేయబోతున్నారు. ఈనెల 9న చెన్నైలో భారీగా ఆడియోను విడుదల చేయనున్నారు. ఈ ఆడియో విడుదల కార్యక్రమంలో రజినీకాంత్ లేదా విజయ్ వంటి స్టార్ హీరో పాల్గొనబోతున్నారు. ఆడియో వేడుకలో చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి స్పైడర్ నుండి ఒక ట్రైలర్ వచ్చింది. ఇప్పుడు రెండవ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లుగా తెలుస్తోంది.
మొదటి ట్రైలర్‌తో సినిమాపై అంచనాలను ఆకాశానికి తీసుకు వెళ్లారు. ఇక రెండవ ట్రైలర్‌తో సినిమా స్థాయిని అమాంతం పెంచడం ఖాయంగా కనిపిస్తుంది. తమిళంలో ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేసేందుకు మురుగదాస్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. మహేష్‌బాబు కెరీర్‌లోనే ఈ సినిమా భారీ వసూళ్లు సాధించడంలో తమిళ కలెక్షన్స్ కీలకం కాబోతున్నాయి. ‘బాహుబలి’ మొదటి పార్ట్ కలెక్షన్స్‌ను వసూళ్లు చేయడం లక్ష్యంగా ఈ సినిమాను తీర్చి దిద్దుతున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో తమిళ దర్శకుడు ఎస్‌జే సూర్య విలన్‌గా నటించాడు. దసరా కానుకగా తెలుగు మరియు తమిళంలో ఒకేసారి విడుదల కాబోతుంది.
మరిన్ని వార్తలు: