Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
భరత్ అను నేను సినిమా చూసి చిత్రబృందంపై ప్రశంసల వర్షం కురిపించిన తెలంగాణ మంత్రి కేటీఆర్ ను ఉద్దేశించి శ్రీరెడ్డి సోషల్ మీడియాలో కామెంట్లు చేసింది. మహేశ్ బాబు సినిమా భరత్ అను నేనుకు కేటీఆర్ ప్రమోషన్లు ఇచ్చారని, కానీ సినీ పరిశ్రమలో మహిళల సమస్యలపై స్పందించేందుకు సమయం ఎందుకు కేటాయించడం లేదని శ్రీరెడ్డి ప్రశ్నించింది. కొన్ని నెలలుగా తాము కాస్టింగ్ కౌచ్ పై పోరాడుతున్నామని, తమకు న్యాయం చేయాలని కేటీఆర్ కు విజ్ఞప్తిచేసింది.
తాను ఇప్పటికే మూడు, నాలుగు సార్లు ట్వీట్లుచేశానని, ఇప్పుడు మరోసారి విజ్ఞప్తిచేస్తున్నానని, తమ సమస్యలకు పరిష్కారం చూపించాలని కోరింది. తెలుగు మహిళలు, యువతులకు సినిమాల్లో ఆఫర్లు రావడం లేదని, తాము కేటీఆర్ ను కలవాలనుకుంటున్నామని తెలిపింది. కేటీఆర్ పీఏ మొబైల్ కు తాను పలుమార్లు మెసేజ్ లు చేశానని, కానీ స్పందన రాలేదని ఆరోపించింది. సినీ పరిశ్రమకు సంబంధించిన పెద్ద కుటుంబాలు తమ సమస్యలపై సరైన రీతిలో స్పందించడం లేదని, వారు తీసుకున్న నిర్ణయాలపై తాము సంతృప్తి చెందడం లేదని తెలిపింది. తమ సమస్యలకు పరిష్కారం చూపిస్తామని కేటీఆర్ చెప్పాలని శ్రీరెడ్డి డిమాండ్ చేసింది. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న శ్రీరెడ్డి గతంలోనూ పలుమార్లు ఈ సమస్యపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరింది.