హమయ్య… బిగ్‌బాస్‌లో లేదట

Sri Reddy doesn't Participate in Bigg Boss Telugu Season 2

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రేపటి నుండి బుల్లి తెర ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘బిగ్‌బాస్‌’ సీజన్‌ 2లో శ్రీరెడ్డి ఉందా లేదా అంటూ సోషల్‌ మీడియాలో జరుగుతున్న చర్చకు ఫుల్‌స్టాప్‌ పడటం జరిగింది. శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు బిగ్‌బాస్‌లో ఆమె ఉండబోతుందనిపించింది. దాంతో బిగ్‌బాస్‌లో ఆమె ఉంటే రచ్చ ఖాయం అని, ఆమెను ఇతర పార్టిసిఫెంట్స్‌ ఎలా రిసీవ్‌ చేసుకుంటారు, ఆమెతో ఇతరులు ఎలా ఉంటారు అంటూ అంతా చర్చించుకున్నారు. నానిపై గత కొన్ని రోజులుగా ఆమె తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేస్తుంది. నీ కాపురంలో నిప్పులు పోస్తాను, నీ అంతు చూస్తాను, నీకు జీవితం తెలియదు అంటూ రకరకాలుగా నానిపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తూ వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీరెడ్డి షోలో ఉంటే నాని సాఫీగా షోను నిర్వహించలేడు. అందుకే ఆయన వెసులుబాటు కోసం స్టార్‌ మా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అనిపిస్తుంది.

ప్రస్తుతం షోకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. నాని మరియు పార్టిసిపెంట్స్‌ సిద్దం అయ్యారు. ఈ సమయంలోనే తాను బిగ్‌బాస్‌లో ఉండబోను అంటూ శ్రీరెడ్డి స్వయంగా ప్రకటించింది. నిరాశ పర్చుతున్నందుకు సారీ అంటూ నానిగాడు తప్పించుకున్నాడు అంటూ ఆమె వ్యాఖ్యలు చేసింది. నానిపై ఈరేంజ్‌లో ఈమెకు కక్ష ఎందుకు అంటూ ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. భారీ ఎత్తున శ్రీరెడ్డి చేస్తున్న విమర్శలను నాని ఫ్యాన్స్‌ తిప్పికొడుతున్నారు. నాని మాత్రమే కాకుండా శ్రీరెడ్డి పలువురు స్టార్స్‌ను కూడా టార్గెట్‌ చేస్తుంది. నాని ప్రస్తుతం నాగార్జునతో మల్టీస్టారర్‌ చేస్తున్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్‌తో కూడా ఈయన ఒక సినిమా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక శ్రీరెడ్డి విషయానికి వస్తే ఎక్కువగా సోషల్‌ మీడియాలో కనిపిస్తున్న శ్రీరెడ్డి మళ్లీ మళ్లీ వారిపై చేసిన విమర్శలే మళ్లీ మళ్లీ చేస్తూ ఉంది.