మాట మార్చిన శ్రీరెడ్డి

Sri Reddy Police Officer Getup in Ready Diary

తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన పలువురిపై సంచన ఆరోపణలు చేయడం ద్వారా వెలుగులోకి వచ్చిన శ్రీరెడ్డి కొందరు స్టార్స్‌ను భయపెడుతూ ఉంది. ఈమె చేస్తున్న ఆరోపణలు ఎప్పుడు ఎలా ఉంటాయో అంటూ కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇటీవల ఈమె తమిళ సినీ పరిశ్రమపై పడినది. ఈమె చేస్తున్న విమర్శలు అక్కడ వేడిని రగిల్చాయి. అయితే ఏం జరిగిందో ఏమో కాని శ్రీరెడ్డికి తమిళ సినీ పరిశ్రమలో వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే శ్రీరెడ్డి తమిళంలో మూడు సినిమాలకు సైన్‌ చేసినట్లుగా సమాచారం అందుతుంది. తమిళంలో వరుసగా చిత్రాల్లో నటించే అవకాశం వస్తున్న కారణంగా చెన్నైకి తన మకాం మార్చినట్లుగా ఈమె ప్రకటించింది. ఇక తాజాగా ఈమె ‘రెడీ డైరీ’ అనే చిత్రాన్ని మొదలు పెట్టింది. చిత్రానికి సంబంధించిన ప్రెస్‌మీట్‌ నిర్వహించింది. ప్రెస్‌మీట్‌లో సినిమా గురించి చెప్పుకొచ్చింది.

Sri Reddy

తనను మోసం చేసిన వారి గురించి, తనకు ఆఫర్లు ఇస్తానంటూ నమ్మించి వాడుకున్న వారి గురించి ఈ చిత్రంలో చూపించబోతున్నట్లుగా ఆమె చెప్పింది. టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్స్‌కు సంబంధించిన వీడియోలు కూడా ఈ చిత్రంలో చూపిస్తాను అంటూ ప్రకటించింది. కాని తాజాగా మాట మార్చింది. ‘రెడీ డైరీ’ అనేది తన బయోపిక్‌ కాదని, తాను ఈ చిత్రంలో పోలీస్‌ పాత్రలో కనిపించబోతున్నట్లుగా చెప్పుకొచ్చింది. సినిమా పరిశ్రమకే చెందిన కథతో ఈ చిత్రాన్ని చేస్తున్నట్లుగా ఆమె ప్రకటించింది. పోలీసు పాత్రలో తాను చాలా పవర్‌ ఫుల్‌గా ఈ చిత్రంలో కనిపించబోతున్నట్లుగా ఆమె ప్రకటించింది. త్వరలోనే ఈ చిత్రంతో తమిళ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా శ్రీరెడ్డి ప్రకటించింది. ఇక శ్రీరెడ్డి తమిళంలో ఈ చిత్రంతో సక్సెస్‌ అందుకేంటే వరుసగా ఆమెకు తమిళనాట ఛాన్స్‌లు దక్కే అవకాశం ఉంది.