తమిళనాడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు దివంగత కరుణానిధి మరణం తర్వాత డీఎంకేలో బలప్రదర్సనకు కరుణానిధి కుమారులైన అళగిరి, స్టాలిన్‌లు సిద్దమయినట్టుగా తెలుస్తోంది. కరుణ మరణానతరం కరుణ మద్దతు దారులందరూ తన వెంటే ఉన్నారని అలజడి సృష్టించిన అళగిరి డీఎంకే అధ్యక్ష పీఠం దక్కించుకునే దిశగా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే కరుణానిధి సమాధిని సందర్శించిన ఆయన అక్కడే మీడియాతో మాట్లాడుతూ డీఎంకే మద్ధతుదారులు అందరూ తనవైపే ఉన్నారని ప్రకటించారు. అంతా అనుకున్నట్టే జరిగితే విజయం తనదేనని కూడా ధీమా వ్యక్తం చేశారు.
ఇది జరిగిన మరుసటి రోజే డీఎంకే కార్యవర్గ సమావేశం అత్యవసరంగా నిర్వహించారు. మాజీ అధినేతకు నివాళి ప్రకటించెందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఆ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్, మరో సీనియర్ నేత దురైమురుగన్‌తో పాటు పార్టీలోని ఇతర కీలక నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం స్టాలిన్ మాట్లాడుతూ, మున్ముందు ఎదురయ్యే ‘ఎలాంటి’ సవాళ్ళనైనా ఎదుర్కొని విజయమే పరమావధిగా ముందుకేళతామని ఎగురవేస్తామని ప్రకటించారు. అంటే పరోక్షంగా తన అన్న అళగిరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు.
అన్నా దమ్ముల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్న ఈ నేపథ్యంలోనే అళగిరి తన బలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నారని తన కుమారుడు దురై దయానిధిని ఎన్నికల బరిలో నిలిపేందుకు సన్నాహాలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. కరుణానిధి మృతితో ఖాళీ అయిన తిరువారూరు నియోజకవవర్గంలో డీఎంకే తరఫున ఇటీవల పార్టీ కార్యక్రమాల్లో తరచూ కనిపిస్తున్న స్టాలిన్ కుమారుడు ఉదయనిధిని ఇక్కడి నుండి పోటీ చేయించాలని స్టాలిన్ చూస్తున్నారని తాత పోటీచేసిన నియోజకవర్గం నుంచే మనువడు రాజకీయ జీవితాన్ని ప్రారంభించాలని స్టాలిన్ భావించి సినీ గ్లామర్ కూడా ఉన్న ఉదయనిదిని ఆ నియోజకవర్గం అయితేనే బాగుంటుందని స్టాలిన్ భావిస్తున్నారని తెలుస్తోంది. అయితే మరో పక్క తన బలం నిరూపించేందుకు అళగిరి లక్ష మంది మద్దతుదారులతో చెన్నై నగర వేదికగా బలప్రదర్శనకు దిగనున్నారు. ఇందులో భాగంగా ఆయన వచ్చే నెల 5వ తేదీన నగరంలో శాంతిప్రదర్శన నిర్వహించనున్నారు. దీంతో తండ్రి మరణించాక కూడా సోదరులు మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది, ఇప్పటికే తమిళ రాజకీయాల్లోకి ఒకపక్క రజనీ, మరోపక్క కమల్ దిగగా పార్టీలో వచ్చే చీలిక పార్టీ మనుగడకే ప్రమాదమని విశ్లేషకులు భావిస్తున్నారు.