స్టైలిష్ స్టార్ అల్లు ఆర్జున్ న్యూ ఆఫీస్

Stylish Star Allu Arjun In Swanky New Office

అల్లు ఆర్జున్ కేర్ అఫ్ అల్లు అరవింద్ లేదా గీత ఆర్ట్స్. ఎందుకంటే అల్లు ఆర్జున్ ఎక్కువగా గీత ఆర్ట్స్ ఆఫీస్ లోనే తన సినిమాల పనులు చూసుకుంటూ ఉంటాడు. ప్రస్తుతం అల్లు ఆర్జున్ సినిమా గురుంచి ఫిలిం నగర్ లో జోరుగా చర్చ సాగుతుంది. కానీ అల్లు ఆర్జున్ నుండి ఇంకా ఏలాంటి ప్రకటన మాత్రం రాలేదు. త్రివిక్రమ్ తో ఓ సినిమా ఉన్నది కానీ అది ఎప్పుడు సెట్స్ పైకి వెళ్లనున్నది మాత్రం ఇంకా అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. ఇక అల్లు ఆర్జున్ సొంతగా ఓ బ్యానర్ ను స్టార్ట్ చేయాలి అన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దానికి సంబంధించి హైదరాబాద్ లోని జుబ్లిహిల్ల్స్  ఏరియాలో ఆఫీస్ ఓపెన్ చేశాడు అంట.

Allu Arjun New office

ఆ ఆఫీస్ కు సంబందించిన ఓ ఫోటో సోషల్ మీడియా లో వైరల్ అవ్వుతుంది. ఆ ఫోటోలో అల్లు ఆర్జున్ యమ స్టైలిష్ గా ఉన్నాడు. వైట్ షర్టు, బ్లాకు పాయింట్, బ్లాకు షూస్, బ్లాకు గాగుల్స్ పెట్టుకొన్ని స్టైలిష్ అంటే అల్లు అర్జునే అనే విధంగా ఫోటో కి ఫోజు ఇచ్చాడు. వాల్ కి AA అల్లు ఆర్జున్ సైన్ బోర్డు కూడా పెట్టేశాడు. మరి త్వరలోనే బ్యానర్ కు సంబందించిన లోగో, మరియు టైటిల్, ఆ బ్యానర్ లో వచ్చే మొదటి సినిమా బన్నీ ప్రకటిస్తాడేమో చూడాలి. బన్నీ ఆఫీస్ గురించి ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్ లో తెగ చర్చ జరుగుతోంది.