అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ చిత్రం తర్వాత నటించబోతున్న సినిమాపై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. ఆ చిత్రం విడుదలైన వెంటనే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేస్తాడని అంతా అనుకున్నారు. కాని ఆ చిత్రం ఫ్లాప్ నేపథ్యంలో ప్రయోగాలు వద్దనుకున్న బన్నీ పలువురు దర్శకులతో సంప్రదింపలు జరపడంతో పాటు, ఎన్నో కథలు విన్నాడు. చివరకు త్రివిక్రమ్ వద్దకు వచ్చి ఆగాడు. అరవింద సమేత చిత్రంతో తాజాగా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన త్రివిక్రమ్‌తో బన్నీ తదుపరి చిత్రం ఉంటుందని దాదాపుగా కన్ఫర్మ్ అయ్యింది. త్రివిక్రమ్ తో సినిమా చేసిన తర్వాత మారుతితో ఒక సినిమాను బన్నీ చేస్తాడంటూ వార్తలు వస్తున్నాయి.
సోషల్ మీడియాలో తెగ కుమ్మేస్తున్న ఈ వార్తలు పచ్చి పుకార్లు అంటూ మెగా సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పటి వరకు కమర్షియల్‌గా బిగ్గెస్ట్ సక్సెస్‌ను అందుకోలేక పోయిన మారుతితో బన్నీ సినిమా ఉండే ఛాన్స్ లేదని, బన్నీకి మారుతి మంచి మిత్రుడు అయితే కావచ్చు కాని, సినిమా మాత్రం చేసే అవకాశం లేదని ఈ సందర్బంగా చాలా మంది మెగా ఫ్యాన్స్ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. త్రివిక్రమ్ తర్వాత బన్నీ లైన్‌లో లింగు స్వామి, విఐ ఆనంద్ ఇంకా పలువురు దర్శకు ఉన్నారు. వారితో సినిమాలు పూర్తి అయ్యేందుకు ఇంకా మూడేళ్లు అయినా పట్టే అవకాశం ఉందని మెగా వర్గాల వారు అంటున్నారు.