‘రంగస్థలం’ చిత్రం మొన్న సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను ఆ చిత్రం దక్కించుకుంది. ఈ సంవత్సరపు బిగ్గెస్ట్ సూపర్ హిట్‌ను రామ్ చరణ్ అందుకున్నాడు. దాదాపు 125 కోట్ల షేర్‌ను వసూళ్లు చేసి బాహుబలి తర్వాత స్థానంలో నిలుచుంది. ఇంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న రంగస్థలం చిత్రం కోసం ఐటైం సాంగ్ జిగేల్ రాణి సింగర్‌కు పారితోషికం ఇవ్వలేదు. ఆ విషయాన్ని స్వయంగా సింగర్ వెంకటలక్ష్మి చెప్పుకొచ్చారు. బుర్రకథలు చెప్పుకుని బతికే తాను చరణ్ మూవీలో పాట పాడితే మంచి పారితోషికం వస్తుందని ఆశించాను. కాని తనకు పారితోషికం ఇవ్వకుండా దేవిశ్రీ మొహం చాటేశాడు అంటూ మీడియా ముందుకు వచ్చి మరీ వెంకటలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేసింది.
రంగస్థలం చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు టాప్ 3 చిత్రంగా నిలిచిన ఈ సమయంలో ఎందుకు పారితోషికం ఇవ్వలేదు అంటూ అంతా కూడా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. సింగర్స్‌కు పారితోషికం విషయంలో బాధ్యత సంగీత దర్శకుడిది. దేవిశ్రీ ప్రసాద్ స్వార్థంతో ఆమెకు పారితోషికం ఇవ్వలేదు. దాంతో ఆమె మీడియా ముందుకు వచ్చింది. ఈ సమయంలోనే సుకుమార్ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. సుకుమార్ ఇలా చేశాడేంటి అంటూ విమర్శలు వ్యక్తం అయ్యాయి. దాంతో సుకుమార్ తనకు సంబంధం లేకున్నా కూడా లక్ష రూపాయలను తన సొంత మనీని వెంకట లక్ష్మికి పంపించినట్లుగా తెలుస్తోంది. తనకు సుకుమార్ గారు డబ్బు పంపించారు అని, బ్యాంకులో డిపాజిట్ అయ్యాయి అంటూ చెప్పుకొచ్చింది.