Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సన్నీలియోన్ గురించి తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇటీవల కేరళలో ఆమె ఫాలోయింగ్ చూసి దేశమే నివ్వెర పోయింది. అక్కడ ఏ సీఎంకు కూడా రాని జనాలు సన్నీలియోన్ ఒక కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో రావడం అందరికి షాక్ ఇచ్చింది. పోర్న్ స్టార్‌గా ఇండియన్ ప్రేక్షకులకు సుపరిచితురాలైన సన్నీలియోన్ ఇటీవల బాలీవుడ్లో సందడి చేస్తోంది. బాలీవుడ్ సినిమాల్లో ఈమె అందాల ప్రదర్శణ ఓ రేంజ్లో ఇస్తోంది. ఎంతగా అందాల ప్రదర్శణ చేసినా కూడా ఈమె గురించి ఏ ఒక్కరు ఇప్పటి వరకు ఫిర్యాదు చేసింది లేదు. ఇండియన్ సంస్కృతిని మంట కలుపుతుందని ఏ ఒక్కరు ఫిర్యాదు చేయలేదు కాని, ఆమె మానవత్వంతో చేసిన పనికిమాత్రం ఫిర్యాదులు వెళ్తువెత్తుతున్నాయి.
ఇటీవల రెండు సంవత్సరాల వయస్సున్న ఒక పాపను సన్నీలియోన్ దంపతులు దత్తత తీసుకున్న విషయం తెల్సిందే. చట్ట పరంగా ఆ పాపను సన్నీ దంపతులు తమ కూతురును చేసుకున్నారు. కన్న కూతురులాగా వారిద్దరు ఆ పాపను చూసుకుంటున్నారు. ఆ పాపకు నిషా కౌర్ వెబర్ అనే పేరును పెట్టడం జరిగింది. ఆ పాప ఫొటోలు సన్నీలియోన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన కూతురు అంటూ సన్నీలియోన్ పోస్ట్ చేసిన ఫొటోలు వివాదం అవుతున్నాయి. ఆమె ఆ పాప ప్రైవసీని భంగం కలిగించేలా ప్రవర్తించిందని, ఆమె చిన్న పాప కలర్ మరియు ఇతర రూపం గురించి అందరికి చూపించడం ద్వారా ఆ పాప గోప్యత దెబ్బతిన్నది అంటూ విమర్శలు చేస్తూ మానవ హక్కుల సంఘంకు ఫిర్యాదు చేయడం జరిగింది. సన్నీలియోన్ ఇలా తన సొంత కూతురు ఫొటో పెడితే ఎవరైనా పట్టించుకునేవారా, కాని దత్తత కూతురు అవ్వడం వల్ల ఆమెపై మండి పడుతున్నారు. ఇలాంటి పద్దతి సరైనది కాదని సన్నీలియోన్ అభిమానులు కొందరు ఫిర్యాదు చేసిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వార్తలు: