- శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించవచ్చని కీలక తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు
- ఇప్పటినుండి అన్ని వయసులకు చెందిన మహిళలు ప్రవేశించవచ్చు
- భక్తి పేరుతో మహిళల పట్ల వివక్ష చూపడం సరికాదు.
- చట్టము సమాజము రెండు కూడా ఒకదానితో ఒకటి పరస్పరం సమానంగా వెళ్ళాలి
- మహిళలు పురుషుల కంటే తక్కువ కాదు
- మహిళలను ఆలయంలోకి అనుమతించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని స్పష్టంచేసిన రాజ్యాంగ ధర్మాసనం
- పురుషులతో పాటు మహిళలకూ కూడా సమాన హక్కులున్నాయన్న సుప్రీంకోర్టు
- 10 నుంచి 50 సంవత్సరాల వయసు ఉన్న బాలికలు, యువతులు, మహిళలకు శబరిమల ఆలయంలోకి ప్రవేశం కల్పించాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ పూర్తిచేసి తీర్పును వెలువరించిన రాజ్యాంగ ధర్మాసనం
- అందరికీ ఆలయంలోకి ప్రవేశం కల్పించాల్సిందేనంటూ కీలక తీర్పును వెలువరించిన చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ నారీమన్, జస్టిస్ ఖన్విల్కర్, జస్టిస్ ఇందు మల్హోత్రా, జస్టిస్ చంద్రచూడ్‌లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం