సినిమా హాళ్లలో జాతీయగీతం ప్రదర్శనపై తన నిర్ణయాన్ని సుప్రీంకోర్టు వెనక్కి తీసుకుంది. థియేటర్లలో సినిమా ప్రారంభానికి ముందు జాతీయ గీతం ప్రదర్శించాలని, ఆ సమయంలో ప్రేక్షకులంతా లేచి నిల్చోవాలని 2016లో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. అప్పటినుంచి థియేటర్లన్నీ ఈ నిబంధనను తప్పనిసారిగా పాటిస్తూ వచ్చాయి. అయితే ఏదన్నా కారణం వల్ల జాతీయగీతం ప్రసారమయ్యేటప్పుడు ఎవరన్నా లేచినిల్చోకపోవడం వివాదాస్పదమైంది. పలువురిపై కేసులు కూడా నమోదయ్యాయి. దీంతో అనేకమంది సెలబ్రిటీలు దీనిపై వ్యతిరేకత వ్యక్తంచేశారు. దేశభక్తిని నిరూపించుకోడానికి సినిమాహాళ్లే వేదికలయ్యాయా అని ప్రశ్నించారు. గీతాలాపన సమయంలో నిలబడకపోతే దేశభక్తి లేనట్టా అని ఎదురుదాడికి దిగారు.ఈ తరుణంలో సుప్రీంకోర్టు తన తీర్పును సమీక్షించింది. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఈ అంశంపై విచారణ జరిపి థియేటర్లలో జాతీయ గీతం ప్రదర్శన కంపల్సరీ కాదని ఉత్తర్వులు వెలువరించింది. మోరల్ పోలీసింగ్ కు ఫుల్ స్టాప్ పడాలని, ప్రతి ఒక్కరూ ఎప్పుడూ తమ దేశభక్తిని భుజాలపై మోయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. థియేటర్లలో జాతీయ గీతం పాడనంత మాత్రాన వారు జాతి వ్యతిరేకులు కాదనిస్పష్టంచేసింది. ఒకవేళ ఈ నిబంధన ఉండాలని కేంద్రం భావిస్తే తొలుత పార్లమెంట్ లో దాన్ని ఆమోదించాలని సూచించింది.
దేశభక్తిని థియేటర్లలో నిరూపించుకోవాల్సిన పనిలేదు
Posted [relativedate] at [relativetime time_format=”H:i”]