
కంచ గచ్చిబౌలి భూ వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. HCU ఆవరణలో చెట్ల నరికివేతను అడ్డుకోవాలన్న పిటిషన్ ను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు మధ్యాహ్నం 3.30లోపు స్థలాన్ని సందర్శించి నివేదిక సమర్పించాలని హైకోర్టు రిజిస్ట్రార్ ను ఆదేశించింది.తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు చెట్లు నరకకుండా చూడాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతికుమారికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.