మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ భారీ అంచనాల నడుమ రూపొందుతున్న విషయం తెల్సిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చిత్రీకరణ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో జరుగుతుంది. ఇక ఈ చిత్రం టీజర్‌ను చిరంజీవి పుట్టిన రోజు సందర్బంగా నేడు విడుదల చేసిన విషయం తెల్సిందే. టీజర్‌కు అనూహ్యమైన రెస్పాన్స్ దక్కింది. టీజర్‌తో సినిమా స్థాయి అమాంతం పెరిగి పోయింది. టీజర్‌లోని ఒక్కో షాట్ దుమ్ము రేపే విధంగా ఉంది. సినిమాకు సంబంధించిన ప్రతి ఒక్క అంశంలో కూడా రిచ్‌నెస్ కనిపించాలని దర్శకుడు సురేందర్ రెడ్డి అనుకున్నాడు. అన్ని విషయాల్లో కూడా అదే విధంగా ఫాలో అవుతూ వచ్చాడు. అయితే సంగీత దర్శకుడి విషయంలో మాత్రం ఏఆర్ రహమాన్ తప్పుకోవడంతో కాస్త నిరుత్సాహంను వ్యక్తం చేశారు.
రహమాన్‌కు ఏమాత్రం తగ్గకుండా బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేదీ ఈ చిత్రానికి సంగీతాన్ని ఇవ్వబోతున్నట్లుగా టీజర్‌తోనే తేలిపోయింది. చిత్ర యూనిట్ సభ్యుల నుండి సైరాకు సంగీతాన్ని అందించేది అమిత్ త్రివేదీ అంటూ ఇటీవలే అధికారిక ప్రకటన వచ్చింది. ఏఆర్ రహమాన్ తప్పుకున్న సమయంలో ఈ చిత్రానికి సంగీతాన్ని దేవిశ్రీ ప్రసాద్ లేదా తమన్ అందిస్తాడని అంతా భావించారు. కాని బాలీవుడ్ రేంజ్‌లో ఈ చిత్రం ఉండాలి అంటే ఖచ్చితంగా అమిత్ త్రివేదీ అయితేనే బాగుంటుందని రామ్ చరణ్‌తో పాటు అంతా భావించారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అనిపిస్తుంది. ఇక ఈ చిత్రం టీజర్‌లో అమిత్ త్రివేదీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఒల్లు గగుర్లు పొడిచేలా ఉంది. టీజర్‌లోనే సంగీత దర్శకుడు తన సత్తా చాటాడు. ఇక సినిమాలో మరెంతగా తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో ఆకట్టుకుంటాడో చూడాలి. సైరా సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.