స్టిరేన్ విష వాయువు ప్రభావం, లక్షణాలు

స్టిరేన్ విష వాయువు ప్రభావం, లక్షణాలు

మొదటగ దీని లక్షణాలు విషయానికి వస్తే ఇది కళ్ళు,చర్మం మరియు శ్వాస వ్యవస్థల మీద తీవ్రమైన ప్రభావం చూపుతుంది అని కళ్ళల్లో మంటలు చర్మంపై దద్దర్లు ముఖ్యంగా దీనికి ఆక్సిజన్ ను చంపే స్వభావం ఉండడం మూలాన శ్వాస వ్యవసా మీద ఇది ఇంకా గట్టిగా ప్రభావం చూపుతుందని వారు తెలుపుతున్నారు. అలాగే దీనికి తగు జాగ్రత్తలు చూసినట్లయితే దీనికి మొట్టమొదటి ప్రథమ చికిత్స నీరుతోనే అని చెప్తున్నారు.

దీని ప్రభావం మొదలయిన వెంటనే ఎక్కువ మొత్తంలో నీరు తీసుకొని ఒక 15 నిమిషాల పాటు కడగాలని అలాగే కాంటాక్ట్ లెన్స్ ఉన్నవారు వాటని వెంటనే తొలగించాలని అలాగే తడి చేసిన మాస్కులు కానీ లేదా గుడ్డలు కానీ ముఖానికి అడ్డు పెట్టుకోవాలని సూచించారు. అంతే కాకుండా దెబ్బ తిన్న చర్మంపై దుస్తులను వెంటనే తొలగించి సబ్బుతో కడిగి శుభ్రం చెయ్యాలని నిపుణు చెప్తున్నారు.