డ్రంకెన్ డ్రైవ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అయినా కొందరు డోంట్‌కేర్.. అంటూ మద్యం తాగి వాహనాలు నడుపుతున్నారు. బ్రీత్ అనలైజర్ పరీక్షల్లో అడ్డంగా బుక్కవుతూ జరిమానా కట్టేస్తున్నారు. దీనికి ప్రముఖులు, సామాన్యులు తేడా లేకుండా అందరూ పోలీసులకి చిక్కి పరువు పోగొట్టుకుంటున్నారు. అయినా వారిలో కొందరు పరువు పోకుండా ఉండడానికి తంటాలు పడుతుంటే కొందరు మాత్రం అన్నీ వదిలేసి మీడియా కంట పడి పరువు పోగొట్టుకుంటున్నారు.
తాజాగా తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి కుమారుడు సిద్ధార్థ్ డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పోలీసులకు చిక్కాడు. శుక్రవారం రాత్రి మద్యం సేవించి కారు నడుపుతుండగా ట్రాఫిక్ పోలీసులు అతడి కారును సీజ్ చేశారు. నగరంలోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో అతడు పట్టుబట్టాడు. ట్రాఫిక్ పోలీసులు డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండగా అదే సమయంలో సిద్ధార్థ్ టీఎస్ 09 ఈఆర్ 7777 నంబర్ కారులో వచ్చాడు. ట్రాఫిక్ పోలీసులు అతడి వాహనాన్ని నిలిపి బ్రీత్ అనలైజర్‌తో పరీక్షించగా.. సిద్ధార్థ్ మోతాదుకు మించి మద్యం సేవించినట్లు తేలింది.దీంతో కారు స్వాధీనం చేసుకుని అతడిపై కేసు నమోదు చేశారు