Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎన్ని కష్టాలు ఎదురైనా పోలవరాన్ని పూర్తిచేస్తామని ఏపీ ప్రజలకు చంద్రబాబు హామీ ఇస్తున్నారు. ఇందుకోసం కేంద్ర నిధులొచ్చే దాకా ఆగకుండా సొంత నిధులే ఖర్చుపెడుతున్నారు. తద్వారా ప్రాజెక్టు పనులు ఎక్కడా ఆలస్యం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంతచేస్తున్నా క్షేత్రస్థాయిలో కాంట్రాక్టర్లు మాత్రం అనుకున్నంత వేగంగా పనిచేయడం లేదు. దీంతో బాబు వారం వారం సమీక్షలతో హడలెత్తిస్తున్నారు.
ఏపీలో పోలవరం కోసం ఇంత వేగంగా పనులు చేయాలని బాబు టార్గెట్లు పెడుతుంటే.. అటు తెలంగాణలో కేసీఆర్ పోలవరంపై కొత్త అభ్యంతరాలు లేవెనత్తారు. పోలవరం ముప్ఫై లక్షల క్యూసెక్కుల నీటి కోసం డిజైన్ చేశారని, కానీ ప్రస్తుతం యాభై లక్షల క్యూసెక్కులకు సవరించారు కాబట్టి.. ముంపు మదింపు మళ్లీ తాజాగా జరగాలని సుప్రీంకోర్టుకు వెళ్లారు.
ఇప్పుడు సుప్రీంకోర్టు కేసీఆర్ వాదనకు ఓకే అంటే.. ప్రాజెక్టుకు స్టే వస్తుంది. అప్పుడు చంద్రబాబు తాను పూర్తిచేయాలనుకుంటే.. కేసీఆర్ అడ్డు పడ్డారని ప్రచారం చేయొచ్చని తెలుగు తమ్ముళ్లు సంబరపడుతున్నారు. ఇలా తనకు తెలియకుండానే కేసీఆర్ బాబుకు మేలు చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. మరి సుప్రీం ఏం తీర్పు ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
మరిన్ని వార్తలు