Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కళాబంధు టి. సుబ్బిరామిరెడ్డి ఏదైనా అనుకుంటే అది చేసే దాకా ఊరుకోరు. అలాగని ఆయన కనే కలలు చిన్నవేమీ కావు. ఆ కలలు కనడానికి ఆయనకి వుండే ధైర్యమే వేరు. అందుకే ఎవరు పెదవి విరిచినా చిరు, పవన్ కాంబినేషన్ లో త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తానని ప్రకటించారు ఆయన. ఓ వైపు ఆ ప్రయత్నాలు సాగిస్తూనే వున్న టి. సుబ్బిరామిరెడ్డి మరోసారి తన పుట్టిన రోజు వేడుకల్ని ఎప్పటిలాగే వైజాగ్ లో ఘనంగా జరుపుకోడానికి సన్నద్ధం అవుతున్నారు. ఏటా సెప్టెంబర్ 17 న జరిగే టీఎస్సార్ జన్మదిన వేడుకల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ వైపు సినీ రంగ ప్రముఖులు, ఇంకో వైపు ప్రముఖ స్వామీజీలు ఆ వేడుకలలో పాల్గొనడం ఎన్నో సార్లు చూసాం. ఈ సారి వేడుకల్లో ఇంకో అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నారు ఆయన.
దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో పని చేసే అర్చకుల్ని తన పుట్టిన రోజున ఒకే వేదికపైకి తీసుకురావడానికి టి.సుభిరామిరెడ్డి సంకల్పించారు. మొత్తం 14 ప్రముఖ పుణ్య క్షేత్రాలకి సంబంధించిన అర్చకస్వాములు వైజాగ్ వచ్చి ఆయనకి ఆశీర్వచనాలు ఇవ్వబోతున్నారు. ఈ జాబితాలో వున్న గుడుల గురించి తెలిస్తే ఆశ్చర్యపోవడం మీ వంతు అవుతుంది. ఆ లిస్ట్ ఏమిటో ఓ సారి చూసేద్దామా.
1 . తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి శ్రీనివాస మూర్తి దీక్షితులు
2 . భద్రాచలం రాముల వారి ఆలయం నుంచి కె. గోపాలకృష్ణమాచార్యులు
3 . శ్రీశైలం మల్లన్న ఆలయం నుంచి రాచయ్య స్వామి
4 .కంచి కామాక్షి ఆలయం నుంచి గోపికృష్ణ శాస్త్రి
5 . మధుర మీనాక్షి ఆలయం నుంచి సుందర్ భట్టార్
6 . కాశీ అన్నపూర్ణ ఆలయం నుంచి మురళీధర్ గణేశ్వర్.
7 . కలకత్తా కాళీ ఆలయం నుంచి గౌతమ్ బెనర్జీ
8 . మైసూర్ చాముండేశ్వరి ఆలయం నుంచి శశిశేఖర్ దీక్షితులు
9 . విజయవాడ దుర్గ మల్లేశ్వర స్వామి ఆలయం నుంచి శంకర శాండిల్య
10 . శబరిమల అయ్యప్ప ఆలయం నుంచి పరమేశ్వరన్ నంబూద్రి
11 . పూరి జగన్నాధ్ ఆలయం నుంచి బిశ్వానాథ్ రధ్
12 . షిర్డీ సాయిబాబా ఆలయం నుంచి పాథక్.
13 . అమరావతి అమరలింగేశ్వర స్వామి ఆలయం నుంచి శ్రీనివాస శాస్త్రి
14 . సింహాచలం వరాహ నరసింహ స్వామి ఆలయం నుంచి సీతారామాచార్యులు.


మరిన్ని వార్తలు:






