Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Talk About Rana And Trisha Continue In The Relationship
సినిమా ఇండస్ట్రీలో రిలేషన్స్ అనేవి చాలా కామన్‌గా చెప్పుకుంటారు. అయితే కొన్ని రిలేషన్స్ మాత్రమే సుదీర్ఘ కాలం కొనసాగుతాయి. కొన్ని రిలేషన్స్ కొంత కాలంకు పెళ్లిగా మారుతాయి, మరి కొందరు మాత్రం విడిపోతూ ఉంటారు. అయితే రానా, త్రిషల మద్య రిలేషన్ మాత్రం చాలా సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తుంది. వీరిద్దరు కూడా ప్రేమలో ఉన్నారని పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ వార్తలను కొట్టి పారేస్తూ త్రిష నిర్మాతను వివాహం చేసుకునేందుకు సిద్దం అయ్యింది. ఆ వ్యక్తితో ఎంగేజ్‌మెంట్ కూడా అయ్యింది. కాని కొన్ని కారణాల వల్ల ఆ పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. మళ్లీ వీరిద్దరు మద్య రిలేషన్ ఉందనే టాక్ మొదలైంది.
త్రిష పెళ్లి క్యాన్సిల్ అయినప్పటి నుండి కూడా రానాతో మళ్లీ క్లోజ్‌గా ఉంటుంది. ఆ మద్య వీరిద్దరికి సంబంధించిన కొన్ని ప్రైవేట్ ఫొటోలు లీక్ అవ్వడంతో పాటు, వీరిద్దరు ఆ విషయమై సైలెంట్‌గా ఉండటం చూస్తుంటే ఇద్దరి మద్య అఫైర్ ఉందనే అనిపిస్తుంది. తాజాగా ఒక అవార్డు వేడుకలో వీరిద్దరు జంటగా కనిపించారు. వీరిద్దరు ఆ కార్యక్రమంలో చాలా అన్యోన్యంగా కనిపించడంతో పాటు, తెగ ముచ్చట్లు పెట్టుకోవడం కనిపించింది. ఇద్దరు ఒకే కారులో వచ్చి, ఒకే కారులో వెళ్లి పోవడంతో వీరిద్దరు ప్రస్తుతం రిలేషన్‌లో ఉన్నారని అనిపిస్తుంది. దీనిపై అయినా రానా లేదా త్రిష స్పందిస్తుందేమో చూడాలి.
మరిన్ని వార్తాలు: