Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
‘బాహుబలి’ చిత్రం తర్వాత తమన్నాకు భారీ క్రేజ్ దక్కడం ఖాయం అని, ఆ వెంటనే బ్యాక్ టు బ్యాక్ తమన్నాకు అవకాశాలు వస్తాయని అంతా భావించారు. కాని షాకింగ్‌గా తమన్నాకు తెలుగులో పెద్దగా ఆఫర్లు దక్కలేదు. తెలుగులో ఈమె ప్రస్తుతం చేస్తున్న సినిమా ఒకే ఒక్కటి. అది బాలీవుడ్ చిత్రం ‘క్వీన్’ రీమేక్. తమిళంలో కూడా పెద్దగా ప్రాజెక్ట్‌లకు కమిట్ అయినట్లుగా లేదు. అయినా కూడా తాజాగా ఒక బిగ్ ఆఫర్‌కు డేట్లు లేవు అంటూ తమన్నా సమాధానం చెప్పడం ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతుంది. ఇంతకు ఆ నో చెప్పిన సినిమా ఏంటీ, ఆ హీరో ఎవరో తెలుసా.. ఆ హీరో మరెవ్వరో కాదు వెంకటేష్. తేజ దర్శకత్వంలో నటించేందుకు ముద్దుగుమ్మ తమన్నా నో చెప్పిందని సమాచారం అందుతోంది.
‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంతో దర్శకుడిగా సక్సెస్ ట్రాక్‌ను ఎక్కిన తేజ ప్రస్తుతం వెంకటేష్ హీరోగా ఒక సినిమాను చేసేందుకు సిద్దం అవుతున్నాడు. వచ్చే నెలలో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. ఈ చిత్రానికి ‘ఆటా నాదే వేట నాదే’ అనే టైటిల్‌ను ఖరారు చేయడం జరిగింది. మొదట ఈ చిత్రంలో హీరోయిన్‌గా తమన్నాను ఎంపిక చేయాలని తేజ భావించాడు. అయితే తమన్నా మాత్రం సున్నింతంగా ఆఫర్‌ను తిరష్కరించింది. తాను ప్రస్తుతం ఇతరత్ర ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాను అంటూ నో చెప్పింది. తమన్నా నో చెప్పడానికి కారణం బిజీ కాదని, సీనియర్ హీరో అయిన వెంకటేష్‌తో నటించడం వల్ల కుర్ర హీరోలు తనను పూర్తిగా పక్కన పెడతారు అనే ఉద్దేశ్యంతో తమన్నా కాదంది.
తమన్నా ప్రస్తుతం చేస్తోన్న సినిమాతో మళ్లీ మునుపటి క్రేజ్‌ను దక్కించుకుంటాను అనే నమ్మకంతో ఉంది. తమన్నా వదులుకున్న ఆఫర్‌ను కాజల్ ఒడిసి పట్టింది. వెంకటేష్‌తో నటించేందుకు కాజల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రస్తుతం అందరి దృష్టి ఈ సినిమాపై ఉంది. ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం తర్వాత మరోసారి కాజల్‌కు తేజ సక్సెస్ ఇవ్వడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.