Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఇటీవల సినిమా హీరోయిన్స్ ఎక్కువగా కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతున్న విషయం తెల్సిందే. పలువురు హీరోలు తెలుగు మరియు తమిళ సినీ పరిశ్రమల్లో ఈ వ్యవహారం ఎక్కువగా ఉందని, అవకాశాలు కోసం కొన్ని సార్లు హీరోలు, నిర్మాతలు, దర్శకులను అన్ని విధాలుగా సంతృప్తి పర్చాల్సిందే అంటూ పలువురు హీరోయిన్స్ సంచలన ఆరోపణలు చేశారు. తాము అలాంటి పనులకు నో చెప్పడం వల్ల హీరోయిన్స్‌గా సక్సెస్ అవ్వలేక పోయాం అని, అవకాశాలు కూడా రాలేదు అంటూ గతంలో పలువురు హీరోయిన్స్ వ్యాఖ్యలు చేశారు. స్టార్ హీరోయిన్స్ అంతా కూడా ఏదో ఒక సమయంలో నిర్మాత లేదా దర్శకులను సంతృప్తి పర్చినవారే అంటూ మరి కొందరు వ్యాఖ్యలు చేశారు.
తాజాగా కాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై మిల్కీబ్యూటీ తమన్నా స్పందించింది. స్టార్ హీరోయిన్స్ అంతా కూడా ఏదో ఒక సమయంలో రాజీ పడి ఉంటారు అనే విషయాన్ని ఆమె కొట్టి పారేసింది. తాను ఎప్పుడు కూడా అవకాశాల కోసం రాజీ పడలేదని, ప్రస్తుతం అలాంటి వ్యవహారాలు ఇండస్ట్రీలో లేవని, చిన్న చిన్న సినిమాల విషయంలో అలాంటివి గతంలో జరిగితే జరగవచ్చు, కాని ఇప్పుడు మాత్రం అలాంటి వ్యవహారాలకు ఛాన్స్ లేదని, మీడియా ఇప్పుడు చాలా స్ట్రాంగ్ అయిన కారణంగా అలాంటి విషయాలు వెంటనే బయటకు వచ్చే అవకాశం ఉంది. అందుకే దర్శక నిర్మాతలు కాస్టింగ్ కౌచ్‌కు కాస్త వెనుకాడుతారు అంటూ చెప్పుకొచ్చింది. స్టార్ హీరోయిన్స్ అంతా కూడా ఇదే మాట మాట్లాడుతారు. అయినా తప్పు చేసిన వారు ఏ ఒక్కరు కూడా తాము తప్పు చేశాం అని చెప్పుకుంటారా..!