Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తమిళ బిగ్‌బాస్ షో ఏ ముహుర్తాన ప్రారంభం అయ్యిందో కాని అన్ని కష్టాలే. కమల్ హాసన్‌పై ఇటీవలే 100 కోట్లకు పరువు నష్టం దావా వేయడం జరిగింది. ఇక బిగ్‌బాస్ సెట్‌ను ఇక్కడ కార్మికులతో కాకుండా ఎక్కడో ముంబయి నుండి తీసుకు వచ్చి వేయించడం ఏంటి అంటూ బిగ్‌బాస్ సెట్‌పై తమిళ సినీ కార్మికులు దాడికి దిగారు. ఆ సమయంలోనే బిగ్‌బాస్ షోలో పార్టిసిపెట్ చేస్తున్న ఒక కంటెస్టెంట్ అనుచిత వ్యాఖ్యలు చేసింది అంటూ తమిళనాడుకు చెందిన ఒక వర్గం ప్రజలు షోపై ఆగ్రహంగా ఉన్నారు.
తాజాగా బిగ్‌బాస్ సెట్స్‌లో ఒక వ్యక్తి మరణించడంతో అంతా కూడా విమర్శల వర్షం కురుస్తుంది. బిగ్‌బాస్ షోను నిలిపేయాలంటూ కొందరు తమిళనాడు ప్రజా సంఘాల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తునన్నారు. తాజాగా హైకోర్టు కూడా తమిళ బిగ్‌బాస్ షోకు నోటీసులు ఇవ్వడం జరిగింది. తమిళనాడు ప్రజల మనోభావాలను మీరు కించపర్చే విధంగా షోను నడిపిస్తున్నారు. ఇందుకు మీ సమాధానం ఏంటి అంటూ ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు మీరు వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలంటూ హైకోర్టు నోటీసుల్లో పేర్కొనడం జరిగింది. మొత్తానికి తమిళ బిగ్‌బాస్ షో నిర్వాహకులు మరియు కమల్ హాసన్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. సగం రోజులు పూర్తి అయిన ఈ షో ప్రస్తుతం ఆసక్తికరంగా సాగుతుంది. వారం వారం ప్రేక్షకుల ఆధరణ పెరుగుతూ పోతుంది.
మరిన్ని వార్తలు:
రోజులు జైల్లో ఉన్నాడట.. నమ్మోచ్చా?
నా గాడ్ ఫాదర్ దిల్‌రాజు