టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబుపై తమిళ కమెడియన్ మనోజ్ ప్రభాకరన్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. మహేష్‌బాబుకు నటన రాదని, స్పైడర్ చిత్రంలో ఆయన నటన కంటే ఎస్ జే సూర్య చాలా బాగా నటించాడు అంటూ మనోజ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. తన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న నేపథ్యంలో మహేష్ బాబుకు మనోజ్ క్షమాపణలు చెప్పిన విషయం తెల్సిందే. అయితే మహేష్‌బాబు ఫ్యాన్స్ కేవలం సారీతో ఈ వివాదాన్ని ముగించేందుకు ఆసక్తి చూపడం లేదు. మనోజ్‌పై చర్యలు తీసుకోవాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు.
మనోజ్ ప్రభాకరన్‌పై నడిగర్ సంఘం చర్యు తీసుకోవాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై ఇప్పటికే మా కన్వినర్ నరేష్ నడిగర్ సంఘంకు లేఖ రాయడం జరిగింది. రెండు సినిమా పరిశ్రమల మద్య, నటీనటుల మద్య సఖ్యత కొనసాగాలి అంటే మహేష్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అతడిపై చర్యలు తీసుకోవాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే నడిగర్ సంఘం మాత్రం ఈ విషయాన్ని లైట్‌గా తీసుకుంటుంది. ఇప్పటికే మనోజ్ క్షమాపణలు చెప్పాడు కనుక ఎలాంటి చర్యలు అవసరం లేదు అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాని ఫ్యాన్స్ మాత్రం సరిపోదు అంటూ ఆగ్రహంతో ఉన్నారు. ఈ వివాదం ఎక్కడకు దారి తీస్తుందో చూడాలి.