Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తమిళనాడు దక్షిణ భారతంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుగా అభివృద్ధి చెందింది. రాజధాని చెన్నై అయినా.. ఐదారు నగరాల్లో అనేక పరిశ్రమలు విస్తరించాయి. వీటికి కారణేంటి అని ఆలోచిస్తే.. అది బలమైన తమిళ్ లాబీయింగ్ తో పాటు.. పేరున్న నేతల వల్లే సాధ్యపడింది. తమిళనాడులో ఓ కామరాజ్ నాడార్, ఓ అన్నాదురై, ఓ ఎంజీఆర్.. ఓ కరుణానిధి.. ఓ జయలలిత లాంటి జనాదరణగల నేతలున్నారు. ఇతర రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులకూ లేని ఫాలోయింగ్.. ఈ నేతలకు మాత్రం ఫుల్లుగా ఉంది. అందుకే తమిళనాడు శరవేగంగా ముందడుగు వేసింది.
కానీ జయ మరణం తర్వాత మాత్రం జననేత లేని లోటు కనిపిస్తోంది. కరుణానిధి అచేతనావస్థలో ఉండటం, అమ్మ చనిపోవడంతో.. తంబీలు అనాథలయ్యారు. అధికార అన్నాడీఎంకే పళని, పన్నీర్, శశి గ్రూపులుగా విడిపోయి ముక్కలుచెక్కలైంది. ఇక డీఎంకే నేత స్టాలిన్ ఉన్నా.. ఆయనకు ప్రజాదరణ లేదు. భవిష్యత్తులో గొప్ప నేతగా తయారయ్యే అవకాశాలు లేవు. ఎందుకంటే యువకుడిగా స్టాలిన్ చేసిన అరాచకాలు చెన్నైలో ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు. ఆయనకు చాలా బ్యాడ్ బ్యాక్ గ్రౌండ్ ఉంది.
సినిమా స్టార్ రజనీ రాజకీయాల్లోకి వస్తాడేమో అని ఎదురుచూస్తున్న తమిళులకు ఆయన కూడా పెద్ద నేతగా కనిపించడం లేదు. ఎందుకంటే రాజకీయ రంగ ప్రవేశాన్నే నాన్చుతున్న నేత.. ఇక తమనేం ఉద్ధరిస్తాడని వారనుకుంటున్నారు. తమిళనాడు మొదట్నుంచి బోల్డ్ గా మాట్లాడే నేతలకు పెట్టింది పేరు. అంతే కానీ రజనీ లాగా ఎవరూ నొచ్చుకోకుండా మాట్లాడితే రాజకీయాలు సాధ్యం కాదు. మరి జయలలితకు దీటైన వారసుడు ఎప్పుడొస్తాడో.. తమిళుల ఎదురుచూపులు ఎప్పుడు ఫలిస్తాయో.
మరిన్ని వార్తలు: