బాలీవుడ్ స్టార్స్‌ను వణికిస్తున్న తనూశ్రీ కామెంట్స్ తాజాగా అమితాబచ్చన్‌పై పడ్డాయి. ఆశ్చర్యకరంగా ఎవరిపై పడితే వారిపై విరుచుకు పడుతున్న తనూశ్రీ దత్తా ఎప్పుడు ఎలాంటి కామెంట్ చేస్తుందో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆమద్య టాలీవుడ్లో శ్రీరెడ్డి, కోలీవుడ్‌లో సుచి లీక్స్ వ్యవహారం మాదిరిగా ఇప్పుడు తనూశ్రీ దత్తా వ్యవహారం బాలీవుడ్లో చర్చనీయాంశం అవుతుంది. నటుడు, దర్శకుడు, నిర్మాత ఇలా ఎవరిని పడితే వారిని బజారుకు ఈడ్చేందుకు ఏమాత్రం వెనకాడకుండా ఈమె కామెంట్స్ చేస్తూ అందరికి షాక్ ఇస్తుంది. తాజాగా ఈమె అమితాబచ్చన్‌పై వ్యాఖ్యలు చేసింది.
తాను నటించే సినిమాల్లో ఆడవారిని గౌరవించే అమితాబచ్చన్, నిజ జీవితంలో మాత్రం ఆడవారు ఎంతగా ఇబ్బంది పడుతున్నా కూడా కళ్లు మూసుకుని కూర్చుని ఉంటారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆయన సినిమాల్లో ఆడవారికి మంచి గౌరవం అయితే ఉంటుంది, కాని నిజ జీవితంలో ఆడవారి గౌరవం గురించి ఆయన పట్టించుకోడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. మొత్తానికి ఏ ఒక్కరిని కూడా వదలకుండా ఈమె చేస్తున్న వ్యాఖ్యలకు నెక్ట్ బలి అయ్యేది ఎవరో అంటూ బాలీవుడ్ మీడియాలో చర్చ జరుగుతుంది. ప్రస్తుతం బాలీవుడ్లో కొందరు తనూశ్రీకి మద్దతుగా మాట్లాడుతూ ఉంటే మరి కొందరు మాత్రం తనూశ్రీకి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం తటస్థంగా ఉంటూ పరిస్థితులను గమనిస్తున్నారు.