కేరళలో ఏం జరుగుతుంది… కుక్క మూతికి టేప్ చుట్టి నరకం..

dog-kidnapping-for-10-thousand

కరోనా వేళ మొన్న ఏనుగు… నేడు కుక్క. మళ్లీ కేరళనే.. అసలేం జరుగుతుంది కేరళలో. జంతువుల అమానుషంగా ప్రవర్తిస్తున్న కేరళీయులపై సమాజం ఆగ్రహంతో ఊగిపోతుంది. కేరళలోని త్రిసూర్‌ జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని వొల్లూరులో ఓ కుక్కను వీధిలో చైన్‌తో కట్టేసి దాని మూతిని ఇన్సులేషన్‌ టేప్‌తో సీల్‌ చేశారు. దీంతో గడిచిన రెండు వారాలుగా తిండిలేక, నీళ్లులేక కుక్క అల్లాడిపోయింది. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న జంతు సంరక్షణ సేవలకు చెందిన వాలంటీర్లు ఘటనా స్థలానికి వెళ్లి కుక్కను రక్షించారు.

అయితే.. కుక్క నోటికి వేసిన సీల్‌ను తక్షణమే తొలగించారు వాలంటీర్లు. ఈ ఘటనతో టేప్‌ తీసి చూడగా.. కుక్క మూతి తీవ్రంగా గాయపడింది. టేప్‌ను తొలగించిన వెంటనే కుక్క దాదాపు 2 లీటర్ల మంచినీటిని తాగిందని వాలంటీర్లు వివరించారు. చికిత్స నిమిత్తం కుక్కను యానిమల్‌ షెల్టర్‌ హోంకు తరలించారు. కాగా కేరళ రాష్ట్రంలో ఈ మధ్యనే రెండు ఏనుగులు మృతిచెందిన విషయం తెలిసిందే. పాలక్కడ్‌లో పేలుడు పదార్థాలు అమర్చిన ఫైనాపిల్‌ను తిని ఓ ఏనుగు, నార్త్‌ నిలాంబర్‌ అటవీ ప్రాంతంలో తీవ్రగాయాల కారణంగా మరో ఏనుగు మృతి చెందిన విషయం తెలిసిందే.