తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ‘పెళ్లి చూపులు’ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. కేవలం కోటి రూపాయల బడ్జెట్‌తో రూపొందిన ఆ చిత్రం ఏకంగా 20 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి చిన్న చిత్రాల్లో పెద్ద విజయాన్ని దక్కించుకుంది. ‘పెళ్లి చూపులు’ తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా వచ్చాయి. అంచనాలకు తగ్గట్లుగా సినిమాను దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కించడం జరిగింది. సురేష్‌బాబు నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ‘ఈ నగరానికి ఏమైంది’ అనే విభిన్నమైన టైటిల్‌తో తెరకెక్కించడం జరిగింది. టైటిల్‌ను ప్రకటించినప్పటి నుండి కూడా సినిమాపై అంచనాలు పెరుగుతూ పోతున్నాయి. అన్ని వర్గాల వారిని ఈ చిత్రం విశేషంగా ఆకట్టుకోవడం ఖాయం అనే నమ్మకం వ్యక్తం అవుతుంది.
ఇప్పటికే విడుదలైన టీజర్ మరియు ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ దక్కింది. భారీ స్థాయిలో సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనెల 29న చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా సురేష్‌బాబు ప్రకటించాడు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో కూడా ఈ చిత్రాన్ని భారీ ఎత్తున విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఓవర్సీస్లో ఈ చిత్రాన్ని వీకెండ్ సినిమా వారితో కలిసి సురేష్‌బాబు విడుదల చేస్తున్నాడు. ఈ చిత్రంకు సురేష్‌బాబు పెట్టిన బడ్జెట్ కంటే దాదాపు అయిదు రెట్ల లాభం ప్రీ రిలీజ్ బిజినెస్‌తోనే అయినట్లుగా తెలుస్తోంది. శాటిలైట్ రైట్స్ మరియు ఆన్ లైన్రైట్స్ ద్వారా కూడా పెద్ద మొత్తంలో నిర్మాత సురేష్‌బాబు దక్కించుకున్నట్లుగా సమాచారం అందుతుంది. పెళ్లి చూపులు రేంజ్లో ఈ చిత్రం ఆకట్టుకుంటుందనే ప్రచారం జరుగుతుంది.