Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బాల నటుడిగా ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించిన తరుణ్ హీరోగా కెరీర్ ఆరంభంలో అద్బుతమైన విజయాలను సొంతం చేసుకున్నాడు. లవర్ బాయ్‌గా, ఛార్మింగ్ హీరోగా పేరు తెచ్చుకున్న తరుణ్ కెరీర్‌లో దూసుకు పోతున్నాడు అనుకుంటున్న సమయంలో వరుసగా ఫ్లాప్‌లు పడ్డాయి. ఆ ఫ్లాప్‌లతో రెండు సంవత్సరాల్లోనే మొత్తం తారు మారు అయ్యింది. తరుణ్ సినిమాల్లో హీరోగా నటించేందుకు పనికి రాడు అనే స్థాయిలో విమర్శలు వ్యక్తం అయ్యాయి. అయినా కూడా తరుణ్ తను హీరోగా సత్తా చాటుతాను అని, మళ్లీ మునుపటి క్రేజ్ తెచ్చుకుంటాను అంటూ నమ్మకంతో సినిమాలు చేస్తూ ఉన్నాడు.
సంవత్సరంలో ఒకటి అర చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న తరుణ్ తాజాగా ‘ఇది నా లవ్ స్టోరీ’ అంటూ ప్రేమికుల రోజు అయిన నేడు వచ్చాడు. ముందు నుండి కూడా ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో పెద్దగా అంచనాలు లేవు. తరుణ్ గత చిత్రాల మాదిరిగానే ఈ చిత్రం ఉంటుందని అంతా భావించారు. కాని పబ్లిసిటీ ఎక్కువ చేయడంతో పాటు, మంచు మనోజ్ ఒక కీలకమైన గెస్ట్ రోల్‌లో కనిపించడంతో ఎక్కడో ఒక హోప్‌ను సినీ వర్గాల వారు పెట్టుకున్నారు. కాని ఆ హోప్ కూడా నీరుగారి పోయింది. తరుణ్ చిత్రం ఏమాత్రం ఆకట్టుకోలేక పోయింది. కన్నడ రీమేక్ చిత్రం అయిన ఇది తెలుగులో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యింది. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా స్క్రిప్ట్‌ను మార్చడంలో దర్శకుడు విఫలం అయ్యాడు. ఇంకా ఇలాంటి కథలు ఎంచుకుని హీరో తరుణ్ పరువు పోగొట్టుకోవడం తప్ప మరేం లేదు అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.