Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
బిజినెస్, పాలిటిక్స్ చాలా వరకు ఒకేలా ఉంటాయి. అందుకే చాలా మంది పారిశ్రామికవేత్తలు రాజకీయవేత్తలుగా రాణించారు. చాణక్యం, తెలివితేటలు, నోటితో నవ్వి నొసటితో వెక్కిరించడం వంటి చాలా లక్షణాలు ఈ రెండు రంగాలకూ కామన్. ఇప్పుడు దేశంలోనే రెండు అతిపెద్ద కార్పొరేట్ రైవల్రీకి తెరపడబోతుందన్న వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
ఇండియా అనగానే ప్రపంచమంతా గుర్తించే పేరు టాటాలు. దేశ అభివృద్ధికి టాటాలు పోషించిన మాత్రం ఎనలేనిది. కానీ రిలయెన్స్ వారి జోరు తగ్గిపోయింది. రిలయెన్స్ కంపెనీలన్నీ లాభాల్లో ఉంటే.. టాటా కంపెనీలు మాత్రం చాలా వరకు నష్టాల్లో ఉన్నాయి. అందుకే తమ శత్రువుతో రాజీకి రావాలని టాటాలు భావిస్తున్నారు.
జియోతే టెలికాం రంగంలో విప్లవం తీసుకొచ్చిన రిలయెన్స్ కు తమ టెలికాం వ్యాపారం అమ్మేయాలని టాటాలు డీల్ రెడీ చేస్తున్నారు. ముకేష్ కూడా ఇందుకు సరే అనడంతో..త్వరలోనే భారీ డీల్ వెలుగు చూడనుంది. ఇది ఖరారైతే దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ డీల్ అవుతుందని అంచనా.
మరిన్ని వార్తలు: