స్పైస్‌జెట్ టెక్నీషియన్ ప్రమాదవశాత్తు గేర్ డోర్‌లో ఇరుక్కొని ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కోల్‌కతాలో చోటుచేసుకుంది. కోల్‌కతాలోని నేతాజీ సుభాష్‌చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఇవాళ ఉదయం ఓ టెక్నీషియన్ స్పైస్‌జెట్ విమానంలోని మెయిన్ ల్యాండింగ్ గేర్‌ను బాగు చేస్తుండగా..ప్రమాదవశాత్తు అందులో ఇరుక్కుని మృతి చెందాడు. ల్యాండింగ్ గేర్‌ను కట్ చేసి అందులో నుంచి టెక్నిషియన్ మృతదేహాన్ని బయటకు తీసినట్లు ఎయిర్‌పోర్టు ప్రతినిధి ఒకరు తెలిపారు.