నటీ నటులు : సాయి ధరం తేజ్, అనుపమ పరమేశ్వరన్, బెనర్జీ, వైవా హర్ష తదితరులు
సంగీతం : గోపి సుందర్
నిర్మాత : కే.ఎస్.రామారావు
దర్శకత్వం : ఎ.కరుణాకరన్
సాయి ధరం తేజ్, చిరంజీవి మేనల్లుడిగా ఇండస్ట్రీ తెరంగ్రేటం చేసినా తన కంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నాడు. రెండేళ్లుగా వరుస ఫ్లాప్‌లు పలకరిస్తుండటంతో ఈసారి లవ్ స్టోరీ స్పెషలిస్ట్ కరుణాకరన్ తో క్యూట్ లవ్ స్టోరీ అంటూ తేజ్ అంటు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై చిరంజీవి హిట్ చిత్రాల నిర్మాత కె.ఎస్.రామారావు నిర్మించిన తేజ్ సినిమా ట్రైలర్, పాటలు చూశాక ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ పై అనేక అంచనాలు నెలకొన్నాయి. అలాగే తక్కువ చిత్రాలే చేసినా తనకంటూ ప్రత్యేక గుర్తిమౌ పొందిన అనుపమ కి సాయి ధరం తేజ్ కీ కెమిస్ట్రీ బాగా కుదిరింది అని టాక్ రావడంతో సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి. మరి తేజ్ ఐ లవ్యూ టెస్ట్ పాసయ్యాడా లేదా హిట్ అందుకున్నాడో లేదా అనేది చూద్దాం.
తేజ్ కి ఐ లవ్యూ ఎవరు ? ఎందుకు ? చెప్పాలనుకున్నారు !
కరుణాకరణ్ అన్ని సినిమాల్లో కనిపించేలాగే ఓ అందమైన ఉమ్మడి కుటుంబంలోని కుర్రాడే సాయిధరమ్ తేజ్. చిన్నప్పుడే తల్లితండ్రులు చనిపోవటంతో పెద్దనాన్న, బాబాయిలతో కూడిన ఉమ్మడి కుటుంబంలో పెరుగుతాడు. ఓ రోజు సైకిల్ పై ట్యూషన్ కు వెళ్ళి వస్తూ ఉండగా కష్టాల్లో ఉన్న మహిళను తన సైకిల్ పై ఎక్కించుకుని పక్కనే ఉన్న రైల్వే స్టేషన్ కు చేరుస్తాడు. ఆ మహిళను మధ్యలో రౌడీలు రేప్ చేసేందుకు ప్రయత్నిస్తే వాళ్ళను బండరాయితో కొట్టి చంపేస్తాడు. దీంతో జైలు పాలు అవుతాడు. ఏడేళ్ళ తర్వాత ఇంటికి తిరిగొచ్చిన తేజ్ తన చెల్లికి ఇష్టం లేని పెళ్లి జరుగుతుందని తెలిసి ఆమెని ప్రేమించిన వాడికి ఇచ్చి పెళ్లి చేసి కుటుంబం నుండి గెంటి వేయబడతాడు.
ఒకానొక సందర్భంలో తన తల్లి చివరి కోరిక తీర్చేందుకు లండన్ నుండి ఇండియా వచ్చిన నందినిని(అనుపమ) అనూహ్యంగా కలుసుకుని ప్రేమలో పడతాడు. తిరిగి అనుపమ ప్రేమిస్తున్నా అని చెప్పేలోపే ఆమె యాక్సిడెంట్ కి గురయి గతం మర్చిపోతుంది. అలా గతం మర్చిపోయిన ఆమె తేజ్ ని ప్రేమిస్తుందా ? అసలు అనుపమ ఎవరు ? ఆమె తల్లి చివరి కోరిక ఏమిటి ? దానికి తేజ్ కి సంబంధం ఏంటి ? అనే విషయాల సమాహారమే ఈ కధ.
తేజ్ ఐ లవ్యూ బాగానే చెప్పించారా…
కరుణాకరణ్ కెరీర్ మొదటి నుండి లవ్ మీదనే సినిమాలు తీస్తూ వచ్చాడు. అన్నీ చాలా వరకు గట్టెక్కినా ఇప్పుడు మాత్రం తేజ్ విషయంలో ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయాడు. ఎందుకంటే సినిమా చుస్తున్నత సేపు తర్వాత్ సీన్ ని ప్రేక్షకుడు గెస్ చేసేస్తాడు. అలాగే కధలో ఉన్న దాదాపు అన్ని ట్విస్ట్ లు తెలుగు ప్రేక్షకులకి బాగా అలావాటయిపోయినవే, సినిమాలో కామెడీ ట్రాక్ సినిమాకి ఊపిరి అని చెప్పచ్చు. కరుణాకరణ్ రాసుకున్న లైన్ పాతదే కావడంతో కధనంలో ఎక్కడా కొత్తగా చూపడానికి స్కోప్ లేకుండా పోయింది. ఈ మధ్యకాలంలో విడుదల అయిన సినిమాలన్నిటికీ మ్యూజిక్ చేసిన గోపీ సుందర్ ఈ సినిమాకి కూడా మ్యూజిక్ ఇచ్చారు. అదీ తేలిపోయింది, కానీ ఆయన అందించిన RR మాత్రం సినిమాకి ప్లస్, అదే విధంగా కెమెరామెన్ పనితనాన్ని మెచ్చుకోకుండా ఉండలేము, లొకేషన్లను ,హీరో హీరోయిన్ లను అంత బాగా ఎలివేట్ చేశారు. సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. నిర్మాత ఎక్కడా వెనక్కి తగ్గలేదని సినిమా రిచ్ నెస్ చెప్పేస్తుంది. కథలో ట్విస్టులు లేకపోవడం వల్ల సినిమా అనాసక్తిగా, నిదానంగా సాగినట్టు అనిపిస్తుంది. అయితే ఈ లవ్ స్టోరీ అనేక ప్రేమ కథల సమాహారంగా ఉండటంతో మరోసారి ఈ కుర్ర హీరోకు మరోసారి నిరాశే మిగిలిందని చెప్పొచ్చు. సినిమా ఫస్టాఫ్ ఒకింత కూల్ గా సాగిపోతుంది. సెకండాఫ్ ఒకింత భారంగా కదులుతుంది.
ఇక నటీనటుల విషయానికి వస్తే తేజ్ ఎప్పటిలానే చాలా ఈజ్ తో నటించాడు. తనకి అలవాటయిన మేనరిజంతో కామెడీ టైమింగ్ తో అలరించాడు. ముఖ్యంగా సినిమా మొదట్లోని ఒక సీన్ లోచిరంజీవిని జ్ఞప్తికి తెచ్చాడు. అనుపమ చాలా గ్లామరస్ గా కనిపించింది. ఎక్కడా అశ్లీలతకు తావు లేకుండా పక్కింటి అమ్మాయిలా నటించింది. ఇక వైవా హర్ష బ్యాచ్ సినిమాకి ప్లస్, వారు తమదైన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నారు. ఇక థర్టీ ఇయర్స్ పృథ్వి -సురేఖ వాణిల ట్రాక్ కూడా కామెడీ పరంగా మెప్పిస్తుంది. వీరిద్దరి రూపంలో ఇండస్ట్రీకి మరో కామెడీ కపుల్ దొరికినట్టే. ఇక మిగతా పాత్రల్లో నటించిన పవిత్రా లోకేష్, బెనర్జీ తదితరులు తమ తమ పరిధి మేరకి బాగా మెప్పించారు.
తెలుగు బుల్లెట్ పంచ్ లైన్ : తేజ్ ఐ లవ్యూ అని చెప్పాలంటే భారీతనం బడ్జెట్లో కాకుండా కంటెంట్ లో ఉండేలా జాగ్రత్త పడాల్సింది.
తెలుగు బుల్లెట్ రేటింగ్ : 2.5 / 5