Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రాష్ట్ర విభజన తర్వాత కొత్త ప్రాజెక్టులు అనుకున్నంత వేగంగా పూర్తవడం లేదు. రెండు ప్రభుత్వాలు ప్రాజెక్టులపై చిత్తశుద్ధితో అధిక నిధులు కేటాయిస్తున్నా.. కోర్టు కేసులు వెనక్కి లాగుతున్నాయి. ఏపీపై తెలంగాణ, తెలంగాణపై ఏపీ పరస్పరం కేసులు వేసుకుని రెండు రాష్ట్రాల ప్రయోజనాలను దెబ్బతీసుకుంటున్నాయి. మధ్యలో మహారాష్ట్ర, కర్ణాటక అప్పనంగా లబ్ధి పొందుతున్నాయి.
రెండు రాష్ట్రాల పిటిషన్లలో చాలావరకు పక్కరాష్ట్రంపై అక్కసు ఎక్కువగానే ఉంది. అయితే కొన్ని సహేతుక కారణాలున్నా అవి చర్చల ద్వారా పరిష్కరించుకోలేని పనులేం కాదు. అయినా సరే పంతాలకు పోయి సుప్రీం గడప తొక్కడంపై ఇంజినీరింగ్ వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. రాజీ చేసుకుంటే స్వల్ప నష్టంతో పోయేదానికి.. సుప్రీంకు వెళ్లి ఏళ్లతరబడి లాయర్లకు ఖర్చు పెట్టడంలో ఆనందమేంటోనని అంటున్నారు పరిశీలకులు.
నాగార్జునసాగర్ గేట్ల దగ్గర రెండు రాష్ట్రాల పోలీసుల కొట్లాటతో మొదలైన జలయుద్ధం.. ఇప్పుడు మరోసారి కేసుల వరకూ వెళ్లింది. నాగార్జునసాగర్, శ్రీశైలం ఈ రెండు ప్రాజెక్టుల దగ్గర కాస్త చొరవ తీసుకుని ఇద్దరు సీఎంలు ఓ ఒప్పందం కుదుర్చుకుంటే కృష్ణా, గోదావరి బోర్డులు, అపెక్స్ కౌన్సిల్ అవసరం లేదు. కానీ చంద్రబాబు కాస్త చొరవ చూపిస్తున్నా.. కేసీఆర్ మాత్రం బిగుసుకుపోతున్నారనే వాదన కూడా నడుస్తోంది.
మరిన్ని వార్తలు: