Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
డ్రగ్స్ పై ఉక్కుపాదం అంటూ హల్చల్ చేస్తున్న అధికారుల్లో చాలా మందికి పబ్స్ నుంచి వాటాలొస్తాయి. ఇక ప్రభుత్వంలో ఉన్న అగ్రనేతల గురించిచెప్పక్కర్లేదు. వారికీ వాటాలతో పాటు చాలా పబ్స్ లో స్లీపింగ్ పార్ట్ నర్ షిప్ ఉంది. ఇక సినీ సెలబ్రిటీల సంగతి సిట్టే బయటపెడుతోంది. వీరు కాకుండా ఇంకా సమాజంలో ప్రముఖులుగా చలామణీ అవుతున్న చాలా మందికి పబ్బుల్లో పార్ట్ నర్ షిప్ ఉంది.
ఇంత మంది వీఐపీలు నడుపుతున్న పబ్ లు కాబట్టి.. డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. ఎవరైనా ఏమైనా చేయాలనుకున్నా.. సర్కారు అండ ఉంటుంది కాబట్టి నోరు కట్టేసుకోవాల్సి వస్తోంది. కానీ ఇప్పుడు అకున్ సభర్వాల్ డ్రగ్స్ మూలాలను వెతుకుతున్నారు. టాలీవుడ్ టాప్ ఫ్యామిలీస్ లింకులు కూడా బయటపడతుండటంతో.. సినీ ప్రముఖుల్లో కలవరం మొదలైంది.
ఇప్పుడా సినీ ప్రముఖులు తెలంగాణ సర్కారులో మంత్రుల్ని భయపెడుతున్నారట. మా లింకులు బయటికొస్తే.. మీ లింకుల గురించి చెబుతామని బెదిరిస్తున్నారట. ఇది కేసీఆర్ కు కొత్త తలనొప్పిగా మారింది. నిజానికి కేసీఆర్ సీఎం అయ్యాక.. పబ్ ల సంఖ్య రెట్టింపు కంటే పెరిగింది. దీనికి మంత్రుల అండే కారణమనే వాదన ఉంది. మరి ఈ కేసు చివరకు ఏమవుతుందో.