డ్రగ్స్ కేసు సీరియస్సా.. జోకా..?

telangana-government-really-took-seriously-the-drugs-case

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

డ్రగ్స్ కేసును తెలంగాణ ప్రభుత్వం నిజంగా సీరియస్ గా తీసుకుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. మొదట పెద్దల పేర్లు ప్రచారంలోకి వచ్చినా.. డ్రగ్స్ కేసును విచారణ చేస్తున్న అకున్ సభర్వాల్ ను లాంగ్ లీవ్ లో పంపడం వివాదాస్పదమైంది. మళ్లీ కొన్నాళ్లయ్యాక ఆయన్ను లీవ్ నుంచి వెనక్కి పిలవడం కూడా కలకలం రేపింది. ఏదో డీల్ కుదరలేదనే అభిప్రాయం వినిపిస్తోంది.

గతంలో ఏసీబీ కేసు కూడా ఇలాగే నీరుగారిందని, ఇప్పుడు డ్రగ్స్ కేసు కూడా అలాగే చేస్తారని అనుకుంటున్నారు. ఏదో సినిమా పెద్దలతో డీల్స్ కుదుర్చుకుంటే.. కాసిని కాసులు కురుస్తాయనే అభిప్రాయం ఉంది టీఆర్ఎస్ లో. ఇలాంటి సమయంలో అకున్ సభర్వాల్ పేరు చెప్పి కాస్త సంపాదించుకుందామని టీఆర్ఎస్ ఛోటా నేతలు కూడా సరదా పడుతున్నారట.

ఇప్పుడు టీఆర్ఎస్ చేతిలో రాయిలా మారింది డ్రగ్స్ కేసు అంటున్నారు పరిశీలకులు. అనవసరంగా టాలీవుడ్ పెద్దలు డ్రగ్స్ కేసులో ఇరుక్కుని కేసీఆర్ కు అవకాశం ఇచ్చారని అనుకుంటున్నారు. మరి డ్రగ్స్ కేసు ఏ మలుపు తిరుగుతుంది. ఎంతమంది జైలుకెళ్తారనేది ప్రశ్నార్థకమే.

మరిన్ని వార్తలు: